Telugu Global
Cinema & Entertainment

రాజ్ తరుణ్ తో.... బాలీవుడ్ స్టార్ హీరోయిన్?

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువ హీరో రాజ్ తరుణ్ ‘లవర్’ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్… కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించిన షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోతుందని పుకార్లు బయటకు వచ్చాయి. కానీ ఒక […]

రాజ్ తరుణ్ తో.... బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
X

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువ హీరో రాజ్ తరుణ్ ‘లవర్’ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్… కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించిన షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోతుందని పుకార్లు బయటకు వచ్చాయి. కానీ ఒక వైపు అదితీరావ్ హైదరీ వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరి అలాంటిది ఆమె వరుస ఫ్లాపులతో ఉన్న రాజ్ తరుణ్ సరసన నటించేందుకు ఒప్పుకుంటుందా? అనేది ప్రశ్న.

మరోవైపు మొదటి సినిమాకే అదితి రావు హైదరి ఏకంగా 65 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. షూటింగ్ కోసం ఎప్పుడు వచ్చినా ఆమె నిర్మాతలకు కొన్ని నిబంధనలు కూడా పెడుతుందట. ఆమె కేవలం స్టార్ హోటల్లో మాత్రమే ఉంటారట. పైగా ఆమె స్టాఫ్ కోసం కూడా నిర్మాతలు ఖర్చు పెట్టాలి.

అయితే రాజ్ తరుణ్ కి అంత మార్కెట్ లేదు. సినిమా బడ్జెట్ నాలుగు, ఐదు కోట్ల కంటే తక్కువ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో అదితీరావ్ హైదరీ ని హీరోయిన్ గా తీసుకోవడం అంటే జరిగే పనులు కాదు. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.

First Published:  19 Jun 2019 2:23 AM GMT
Next Story