బాలీవుడ్ కి నేను దూరం – సమంత

పెళ్లికి ముందు ఒకలాగా పెళ్ళికి తర్వాత ఒకలాగా అని కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్న సమంత కి మిగిలిన ఇండస్ట్రీస్ లో మంచి క్రేజ్ ఉంది. సమంత ఒప్పుకోవాలి కానీ సినిమా చేయడానికి హిందీ లో కూడా నిర్మాతలు రెడీ గా ఉన్నారు. కానీ సమంత మాత్రం ఇందుకు ఒప్పుకొనేలా లేదు.

ఒకవేళ అవకాశం వస్తే నార్త్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తారా? అని అడిగితే విచిత్రం గా సమాధానం చెప్పింది సమంత. “అసలు నాకు నార్త్ ప్రేక్షకులు ఏం ఆశిస్తారో తెలియదు, నా నుండి వాళ్ళు ఏమి కోరుకుంటారో తెలియదు. వాళ్ళ అభిరుచుల పైన అవగాహన లేదు నాకు. నేను అలా ఒక ఏలియన్ లాగా కనిపిస్తానేమో వాళ్ళకి. అందుకే నేను నార్త్ వైపు ఆసక్తి చూపడం లేదు. అయినా ఇంకా సౌత్ ఆడియన్స్ కి నేను చేయాల్సింది చాలా ఉంది. ఇంకా మంచి కథలు, పాత్రల తో వాళ్ళని మెప్పించాలి” అని అంటుంది సమంత.

అందరూ ఒక్క సినిమా అయినా హిందీ లో చేయాలి అని చూస్తున్న తరుణం లో సమంత సమాధానం అందరికీ కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.