Telugu Global
NEWS

ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ.... శారదా పీఠానికి రెండు ఎకరాలు.... టీఎస్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

చాన్నాళ్ల తర్వాత సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా జరిగిన ఈ క్యాబినెట్ సమావేశం రెండు గంటలకు పైగా సాగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం, జలవివాదాలు, భూముల కేటాయింపు వంటి విషయాలపై చర్చించారు. కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ పలు విషయాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఏపీ సీఎంలను ఆహ్వానించామని చెప్పారు. పక్క […]

ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ.... శారదా పీఠానికి రెండు ఎకరాలు.... టీఎస్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
X

చాన్నాళ్ల తర్వాత సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా జరిగిన ఈ క్యాబినెట్ సమావేశం రెండు గంటలకు పైగా సాగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం, జలవివాదాలు, భూముల కేటాయింపు వంటి విషయాలపై చర్చించారు.

కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ పలు విషయాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఏపీ సీఎంలను ఆహ్వానించామని చెప్పారు. పక్క రాష్ట్రాలతో ఇప్పటికే కృష్ణా, గోదావరి వివాదాలు ఉన్నాయని.. వాటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని.. ఇప్పటికే దీనికి సంబంధించిన కరకట్టల నిర్మాణం పూర్తయ్యిందని కేసీఆర్ వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే కాళేశ్వరం పనులు వేగవంతంగా పూర్తయ్యాయని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ నెల 28న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారుల సమావేశం జరగనుందని చెప్పారు.

హైదరాబాద్‌లోని తమ భవనాలను ఏపీ అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. వైఎస్ జగన్ సాగు నీరు అందించాలనే ధృడ సంకల్పంతో పని చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు.

ఇక తెలంగాణ కొత్త అసెంబ్లీ భవాన్ని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తామని.. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకుంటామన్నారు.

కొత్త సెక్రటేరియట్‌కు 27న భూమి పూజ చేస్తామని చెప్పారు. శారదా పీఠానికి రెండు ఎకరాలు, 30 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు ఎకరం చొప్పున భూమి కేటాయించడానికి మంత్రిమండలి నిర్ణయించింది.

First Published:  18 Jun 2019 7:41 PM GMT
Next Story