Telugu Global
NEWS

ప్రపంచకప్ లో సిక్సర్ల తుపాను

సిక్సర్ల బాదుడులో ఇంగ్లండ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు ఇంగ్లండ్-అప్ఘన్ మ్యాచ్ లో 33 సిక్సర్ల నమోదు ఒక్క ఇన్నింగ్స్ లో 25 సిక్సర్లతో ఇంగ్లండ్ రికార్డు వన్డే క్రికెట్లో సిక్సర్లబాదుడులో రికార్డుల మోత మోగింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా …మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్- పసికూన అఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ముగిసిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది. సిక్సర్లు బాదడంలో, బాదించుకోడంలో సైతం సరికొత్త ప్రపంచ రికార్డులు […]

ప్రపంచకప్ లో సిక్సర్ల తుపాను
X
  • సిక్సర్ల బాదుడులో ఇంగ్లండ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు
  • ఇంగ్లండ్-అప్ఘన్ మ్యాచ్ లో 33 సిక్సర్ల నమోదు
  • ఒక్క ఇన్నింగ్స్ లో 25 సిక్సర్లతో ఇంగ్లండ్ రికార్డు

వన్డే క్రికెట్లో సిక్సర్లబాదుడులో రికార్డుల మోత మోగింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా …మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్- పసికూన అఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ముగిసిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది. సిక్సర్లు బాదడంలో, బాదించుకోడంలో సైతం సరికొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.

వన్డే క్రికెట్ టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్, 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ జట్ల ఈ ఏకపక్షపోరులో..ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 397 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.

మోర్గాన్ సిక్సర్ల వెల్లువ….

ఇంగ్లండ్ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ కేవలం 71 బాల్స్ లోనే 148 పరుగులతో సునామీ సెంచరీ సాధించాడు. ఇందులో 17 సిక్సర్లు , 4 బౌండ్రీలు ఉన్నాయి.

57 బాల్స్ లోనే వంద పరుగులతో సెంచరీ పూర్తి చేసిన మోర్గాన్…ప్రపంచకప్ చరిత్రలో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన క్రికెటర్ గా నిలిచాడు.

మోర్గాన్ ప్రపంచ రికార్డు…

వన్డే క్రికెట్లో…అదీ ప్రపంచకప్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు బాదిన మొనగాడిగా మోర్గాన్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. ఇప్పటి వరకూ రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్ , క్రిస్ గేల్ ల పేరుతో ఉన్న 16 సిక్సర్ల సంయుక్త ప్రపంచ రికార్డును మోర్గాన్ తెరమరుగు చేశాడు.

అంతేకాదు…ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా 25 సిక్సర్లు బాదిన తొలిజట్టుగా ఇంగ్లండ్ రికార్డుల్లో చోటు సంపాదించింది.

ఇంగ్లండ్ రికార్డు విజయం..

398 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 247 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 150 పరుగుల భారీ తేడాతో అతిపెద్ద విజయం సాధించింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు, అత్యధిక స్కోరు, అత్యధిక తేడాతో నెగ్గిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డుల మోత మోగించింది.

First Published:  18 Jun 2019 9:40 PM GMT
Next Story