Telugu Global
Cinema & Entertainment

రాక్షసుడిలా కౌసల్య కృష్ణమూర్తి కూడా....

ఒక భాష లో విడుదలైన సినిమాని మరొక భాషలో రీమేక్ చేయాలంటే కొందరు అన్ని సీన్లను రిపీట్ చేయకుండా ఒరిజినల్ వెర్షన్ లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొని కేవలం ముఖ్య పాత్రలు పోషించే వారిని మాత్రమే మారుస్తూ ఉంటారు. అలా షూటింగ్ సమయం మాత్రమే కాక బడ్జెట్ కూడా తగ్గుతూ ఉంటుంది. గతంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా విషయంలో అదే చేశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత […]

రాక్షసుడిలా కౌసల్య కృష్ణమూర్తి కూడా....
X

ఒక భాష లో విడుదలైన సినిమాని మరొక భాషలో రీమేక్ చేయాలంటే కొందరు అన్ని సీన్లను రిపీట్ చేయకుండా ఒరిజినల్ వెర్షన్ లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొని కేవలం ముఖ్య పాత్రలు పోషించే వారిని మాత్రమే మారుస్తూ ఉంటారు. అలా షూటింగ్ సమయం మాత్రమే కాక బడ్జెట్ కూడా తగ్గుతూ ఉంటుంది.

గతంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా విషయంలో అదే చేశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ‘గురు’ సినిమా కి కూడా అదే టెక్నిక్ ని వాడారు. వెంకటేశ్, రితికా సింగ్ మధ్య సన్నివేశాలు మారినప్పటికీ బాక్సింగ్ సన్నివేశాలు కొన్ని ఒరిజినల్ లోవే ఉండిపోయాయి.

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘రాక్షసుడు’ సినిమా విషయంలో కూడా దర్శక నిర్మాతలు అదే చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ జాబితాలో చేరనుంది ‘కౌసల్యా కృష్ణమూర్తి’. ఐశ్వర్య రాజేష్, రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో హిట్టయిన ‘కన్నా’ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో తెలుగు వర్షన్ లో శివకార్తికేయన్ హీరోగా నటించడం లేదు కాబట్టి ఆయన పాత్ర కోసం మాత్రమే రీషూట్ చేస్తున్నట్లు మిగతా సన్నివేశాలు మాత్రం కేవలం ఒరిజినల్ లోవే ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  20 Jun 2019 2:25 AM GMT
Next Story