కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య

టాలీవుడ్ లో డ్రీమ్ కాంబినేషన్ సెట్ అయింది. ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న నాగచైతన్య, అలాంటి ప్రేమకథల్ని బ్రహ్మాండంగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల కలిశారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా పక్కా అయింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఏడాది పాటు సినిమా తీసే శేఖర్ కమ్ముల, జస్ట్ 4 నెలల్లో మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. ఇదే కనుక సాకారమైతే కమ్ముల కెరీర్ లోనే శరవేగంగా తెరకెక్కిన సినిమాగా ఇది నిలిచిపోతుంది. ప్రస్తుతానికి కథా చర్చలు పూర్తయ్యాయి.టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు.

ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ స్పెషాలిటీ పేరు సాయిపల్లవి. అవును.. నాగచైతన్య సరసన ఫస్ట్ టైమ్ మెరవబోతోంది సాయిపల్లవి. వీళ్లిద్దరి కాంబోను తెరపై చూడాలని అక్కినేని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిటింగ్. ఇన్నాళ్లకు శేఖర్ కమ్ముల రూపంలో వీళ్ల కల నెరవేరబోతోంది. త్వరలోనే రాబోతున్న అధికారిక ప్రకటనలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.