కాపు నేతల రహస్య భేటీ…. హాజరైన నేతలు వీరే….

టీడీపీలో వరుస కల్లోలాలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు విదేశీ పర్యటనల్లో ఉన్న సమయంలో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు జంప్‌ అవడానికి రంగం సిద్దమైంది. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి ఎంపీలు లేఖ కూడా ఇవ్వబోతున్నారు.

ఇది నడుస్తుండగానే టీడీపీ కాపు నేతల రహస్య సమావేశం సంచలనంగా మారింది. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాపు కీలక నేతలు సమావేశం అయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో బోండా ఉమా, జ్యోతుల నెహ్రు, కదిరి బాబురావు, బూరగడ్డ వేదవ్యాస్, బుడేటి బుజ్జి, ఈలి నానితో పాటు మరికొందరు ఉన్నారు.

టీడీపీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఇక పార్టీలో ఉండడం వల్ల ఉపయోగం లేదన్న భావనను వీరు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో మూకుమ్మడిగా చేరేందుకు వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

తోట త్రిమూర్తులు మాత్రం ప్రస్తుతానికి తాము టీడీపీలో ఉన్నామని… భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీరు ఏ క్షణంలోనైనా మూకుమ్మడిగా పార్టీ వీడడం ఖాయంగా కనిపిస్తోంది.