Telugu Global
National

టీడీపీ బాగా బలపడాలి.... అది నా కోరిక

బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి… చంద్రబాబుపై మాత్రం అభిమానాన్ని చంపుకోలేకపోతున్నారు. బీజేపీలోకి చేరిన ఆయన బీజేపీ బలోపేతం కావాలని కోరుకోవాల్సింది పోయి… తిరిగి టీడీపీ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. బీజేపీలో చేరిన తర్వాత ఒక మీడియా సంస్థ వద్ద మాట్లాడిన సుజనా చౌదరి… చంద్రబాబుపైనా, టీడీపీపైనా ఎప్పటికీ తనకు గౌరవం ఉందన్నారు. బీజేపీలో చేరడం సంతోషంగా ఉన్నా… టీడీపీని వీడడం అంతకంటే బాధగా తనకు ఉందన్నారు. పార్టీ వీడే ముందు చంద్రబాబుకు చెప్పానని వివరించారు. పార్టీ […]

టీడీపీ బాగా బలపడాలి.... అది నా కోరిక
X

బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి… చంద్రబాబుపై మాత్రం అభిమానాన్ని చంపుకోలేకపోతున్నారు. బీజేపీలోకి చేరిన ఆయన బీజేపీ బలోపేతం కావాలని కోరుకోవాల్సింది పోయి… తిరిగి టీడీపీ బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

బీజేపీలో చేరిన తర్వాత ఒక మీడియా సంస్థ వద్ద మాట్లాడిన సుజనా చౌదరి… చంద్రబాబుపైనా, టీడీపీపైనా ఎప్పటికీ తనకు గౌరవం ఉందన్నారు. బీజేపీలో చేరడం సంతోషంగా ఉన్నా… టీడీపీని వీడడం అంతకంటే బాధగా తనకు ఉందన్నారు. పార్టీ వీడే ముందు చంద్రబాబుకు చెప్పానని వివరించారు.

పార్టీ వీడి వెళ్లవద్దని సహజంగానే చంద్రబాబు చెబుతారు కదా అని వ్యాఖ్యానించారు. కానీ తాము మూడ్‌ఆఫ్‌ ద నేషన్ చూసిన తర్వాత మోడీ నాయకత్వమే తనకు సరైన వేదిక అనిపించిందన్నారు. తాము వెళ్లడం వల్ల టీడీపీ నుంచి అంతా వెళ్లిపోతారని తాను అనుకోవడం లేదన్నారు. తమ లాంటి వారు టీడీపీ నుంచి చాలా మంది వెళ్లిపోయినా ఆ పార్టీకి ఏమీ కాదన్నారు.

చంద్రబాబు తిరిగి టీడీపీని అభివృద్ధి చేస్తారని సుజనా ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మళ్లీ బలపడితే తిరిగి వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసేందుకు సుజనాచౌదరి ప్రయత్నించారు. టీడీపీ తిరిగి బలపడాలన్నది తన ఆశ కాదని… అది తన కోరిక అని సుజనా చౌదరి చెప్పారు.

First Published:  21 Jun 2019 1:56 AM GMT
Next Story