Telugu Global
Cinema & Entertainment

కల్యాణ్ రామ్ కుటుంబ కథా చిత్రం

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ కుటుంబకథా చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించబోతున్న విషయం అందరికీ తెలిసింది. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను సెలక్ట్ చేశారు. ఆమె కూడా లాంఛింగ్ కు హాజరైంది. ఈ సినిమాతో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిజానికి వీళ్లు గతంలో కార్తి నటించిన ఖాకి సినిమాను రిలీజ్ చేసినప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవుతోంది ఈ సినిమాతోనే. మూవీకి […]

కల్యాణ్ రామ్ కుటుంబ కథా చిత్రం
X

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ కుటుంబకథా చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించబోతున్న విషయం అందరికీ తెలిసింది. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను సెలక్ట్ చేశారు. ఆమె కూడా లాంఛింగ్ కు హాజరైంది.

ఈ సినిమాతో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిజానికి వీళ్లు గతంలో కార్తి నటించిన ఖాకి సినిమాను రిలీజ్ చేసినప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవుతోంది ఈ సినిమాతోనే. మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆల్ ఈజ్ వెల్ అని గతంలో అనుకున్నారు. ఇప్పుడా టైటిల్ ను పక్కనపెట్టారు.

ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించబోతున్నాడు. అతడే క్లాప్ కొట్టి ఈ సినిమాను స్టార్ట్ చేశాడు. దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఉమేష్ గుప్తా నిర్మించనున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పించబోతున్నారు.

సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 24 నుండి ప్రారంభం అవుతుంది. నిర‌వ‌ధికంగా హైద‌రాబాద్‌, రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాలతో పాటు ఊటీ లో చిత్రీక‌ర‌ణ చేస్తారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదలకు సిద్ధంచేస్తున్నారు.

First Published:  20 Jun 2019 7:50 PM GMT
Next Story