Telugu Global
National

వెంకయ్యా.... నీతి సూక్తులను నిలబెట్టుకోవాలే...!

తన ఆప్తుడు చంద్రబాబునాయుడు ఏపీలో విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సమయంలో వెంకయ్యనాయుడు అలా చేయడం తప్పు అని వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలు చేసే వారే గానీ… నేరుగా చంద్రబాబు వద్ద ఇలా చేయడం నీచం అని మాత్రం ఎన్నడూ చెప్పిన దాఖలాలు లేవు. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత కూడా వెంకయ్యనాయుడు పదేపదే ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఫిరాయింపులు చూస్తుంటే ఆందోళనగా ఉంది. ఈ పరిస్థితి మారాలి… ఫిరాయింపులపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని మూడు వారాల […]

వెంకయ్యా.... నీతి సూక్తులను నిలబెట్టుకోవాలే...!
X

తన ఆప్తుడు చంద్రబాబునాయుడు ఏపీలో విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సమయంలో వెంకయ్యనాయుడు అలా చేయడం తప్పు అని వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలు చేసే వారే గానీ… నేరుగా చంద్రబాబు వద్ద ఇలా చేయడం నీచం అని మాత్రం ఎన్నడూ చెప్పిన దాఖలాలు లేవు.

ఉప రాష్ట్రపతి అయిన తర్వాత కూడా వెంకయ్యనాయుడు పదేపదే ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఫిరాయింపులు చూస్తుంటే ఆందోళనగా ఉంది. ఈ పరిస్థితి మారాలి… ఫిరాయింపులపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని మూడు వారాల క్రితం వ్యాఖ్యానించారు వెంకయ్య. పార్టీలు మారితే మారొచ్చు కానీ… పదవులకు రాజీనామా చేసి ఆ పనిచేయాలని ఒక సందర్భంలో వెంకయ్య హితబోధ చేశారు.

దేశంలోని అందరికీ సూచనలు చేసిన వెంకయ్యనాయుడు ముందుకే ఇప్పుడు టీడీపీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు పర్వం వచ్చి నిలబడింది. తమను బీజేపీలో విలీనం చేయాలని నలుగురు ఎంపీలు లేఖ ఇచ్చారు.

ఇక్కడ వైఫరిత్యం ఏమిటంటే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ నడ్డా కూడా నేరుగా ఫిరాయింపుదారులను వెంటబెట్టుకుని వెళ్లి ఉప రాష్ట్రపతిని కలవడం. మూడింట రెండొంతుల మంది ఎంపీలు పార్టీ మారిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు వారిపై వేటు వేస్తారా? లేదంటే సాంకేతిక కారణాలు చూపించి కార్యానికి తనవంతు సహకారం అందిస్తారా? అన్నది ప్రశ్న.

పార్టీ సమ్మతి లేదు కాబట్టి…. నిజాయితీగా, నైతిక విలువలతో వ్యవహరిస్తే టీడీపీ రాజ్యసభ విభాగాన్ని బీజేపీలో విలీనం చేయలేరు. కేవలం వారిని ప్రత్యేక బృందంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

కానీ వెంకయ్యనాయుడు బీజేపీ నాయకత్వ ఆలోచనను కాదని అలా చేస్తారా? అన్నదే ప్రశ్న. ఎక్కడ ప్రసంగాలు చేసినా నైతిక పాఠాలు చెబుతున్న వెంకయ్యనాయుడు… నైతిక విలువతో నిర్ణయం తీసుకుని దేశానికి, ఫిరాయింపుదారులకు సరికొత్త సందేశం ఇస్తారా?. ఇంకా ధైర్యం ఉంటే ఏకంగా టీడీపీ పిటిషన్ ఇవ్వగానే నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేసి శభాష్ అనిపించుకుంటారా?. ఫిరాయింపుదారులు మన వారే కదా అని వారి పదవులను కాపాడుతారా? లేక తాను కూడా విలువల సంగతి కాసేపు పక్కన పెట్టి రబ్బర్‌ స్టాంప్‌ తరహాలో సాంకేతిక అంశాలను శోధించి బీజేపీ కుండలో టీడీపీ ఎంపీలను కలిపేస్తారా అన్నది చూడాలి.

First Published:  21 Jun 2019 1:40 AM GMT
Next Story