Telugu Global
NEWS

వైసీపీ నుంచి కూడా 23 మంది వెళ్లారు.... కానీ జగన్ కు ఏమైంది?

నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి చేరిపోవడంతో పరిస్థితిని సమర్థించుకునేందుకు టీడీపీ నేతలు చాలా మొట్లు దిగివచ్చి స్పందిస్తున్నారు. పార్టీ ఎంపీలు వీడడంపై స్పందించిన కాలువ శ్రీనివాసరావు… పరిస్థితి చేయి దాటిపోలేదని చెప్పేందుకు పరోక్షంగా వైసీపీ గత పరిస్థితిని ప్రస్తావించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని… కానీ జగన్ కు ఏమైనా అయిందా అని ప్రశ్నించారు. పరోక్షంగా 23 మంది ఎమ్మెల్యేలను తాము వైసీపీ నుంచి తీసుకున్నా జగన్‌కు ఏమీ కాలేదు… ఇప్పుడు తమ […]

వైసీపీ నుంచి కూడా 23 మంది వెళ్లారు.... కానీ జగన్ కు ఏమైంది?
X

నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి చేరిపోవడంతో పరిస్థితిని సమర్థించుకునేందుకు టీడీపీ నేతలు చాలా మొట్లు దిగివచ్చి స్పందిస్తున్నారు. పార్టీ ఎంపీలు వీడడంపై స్పందించిన కాలువ శ్రీనివాసరావు… పరిస్థితి చేయి దాటిపోలేదని చెప్పేందుకు పరోక్షంగా వైసీపీ గత పరిస్థితిని ప్రస్తావించారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని… కానీ జగన్ కు ఏమైనా అయిందా అని ప్రశ్నించారు. పరోక్షంగా 23 మంది ఎమ్మెల్యేలను తాము వైసీపీ నుంచి తీసుకున్నా జగన్‌కు ఏమీ కాలేదు… ఇప్పుడు తమ పార్టీ నుంచి నేతలు వెళ్లినా జగన్‌ తరహాలోనే బయటపడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు కాలువ.

వ్యాపారాల్లో ఉన్న నేతలే ఒత్తిడికి గురై వెళ్లిపోతున్నారని కాలువ వ్యాఖ్యానించారు. వెళ్లిపోయిన ఎంపీలు ప్రజల్లో ఉండేవారు కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. పార్టీకి తప్పకుండా పూర్వవైభవం వస్తుందని ఆ దిశగా తామంతా సమిష్టిగా కృషి చేస్తామని కాలువ చెప్పారు.

First Published:  21 Jun 2019 5:58 AM GMT
Next Story