Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ అన్నయ్యకు మళ్లీ పెళ్లి

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నీలా షా అనే యోగా ట్రైనర్‌ను వివాహం చేసుకున్నాడు. అల్లు బాబి అసలు పేరు వెంకటేశ్. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అల్లు కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి హాజరైనట్లు తెలుస్తోంది. పూణే లో ఎంబీఏ పూర్తి చేసిన నీలా ఇంటర్నేషనల్ యోగా […]

అల్లు అర్జున్ అన్నయ్యకు మళ్లీ పెళ్లి
X

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నీలా షా అనే యోగా ట్రైనర్‌ను వివాహం చేసుకున్నాడు. అల్లు బాబి అసలు పేరు వెంకటేశ్. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

అల్లు కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి హాజరైనట్లు తెలుస్తోంది. పూణే లో ఎంబీఏ పూర్తి చేసిన నీలా ఇంటర్నేషనల్ యోగా ఇన్ స్ట్రక్టర్ కూడా అని సమాచారం. యోగా డెస్టినేషన్ అనే ఒక యోగ స్టూడియో ని కూడా ఆమె నడుపుతున్నారు. అందులో థెరపుటిక్ యోగ, అష్టాంగ యోగ మరియు అయంగార్ యోగ నేర్పిస్తుంటారట.

ముంబై లో పుట్టి పెరిగిన ఈమె ఈ మధ్యనే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఆమె తండ్రి కమల్ కాంత్ పెద్ద బిజినెస్ మ్యాన్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ కూడా హజరయ్యారు. ఆ ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అల్లు శిరీష్ కూడా ఫొటోల్లో కనిపిస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఫొటోల్లో కనిపించలేదు.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తో బిజీగా ఉన్నాడు. అందువల్ల పెళ్లికి హాజరు కాలేక పోయారని తెలుస్తోంది. బన్నీ రాకపోయినా తన తరఫున బన్నీ భార్య స్నేహ మాత్రం పెళ్లి ఫొటోలలో కనిపించారు.

First Published:  22 Jun 2019 1:12 AM GMT
Next Story