Telugu Global
Cinema & Entertainment

ఊపందుకున్న కబీర్ సింగ్

నిన్న రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా అస్సలు బాగాలేదని కొందరు విమర్శిస్తే, అద్భుతంగా ఉందని మరికొందరన్నారు. నిజానికి తెలుగులో కూడా అర్జున్ రెడ్డి రిలీజైనప్పుడు ఇదే తరహా వాదనలు వినిపించాయి. దాని రీమేక్ గానే కబీర్ సింగ్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిన్నరిలీజైన ఈ సినిమా గురించి క్రిటిక్స్ ఏమనుకుంటున్నారనే విషయాన్ని పక్కనపెడితే, మొదటి రోజు వసూళ్లు వరంగా కబీర్ సింగ్ దుమ్ముదులిపింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా […]

ఊపందుకున్న కబీర్ సింగ్
X

నిన్న రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా అస్సలు బాగాలేదని కొందరు విమర్శిస్తే, అద్భుతంగా ఉందని మరికొందరన్నారు. నిజానికి తెలుగులో కూడా అర్జున్ రెడ్డి రిలీజైనప్పుడు ఇదే తరహా వాదనలు వినిపించాయి. దాని రీమేక్ గానే కబీర్ సింగ్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

నిన్నరిలీజైన ఈ సినిమా గురించి క్రిటిక్స్ ఏమనుకుంటున్నారనే విషయాన్ని పక్కనపెడితే, మొదటి రోజు వసూళ్లు వరంగా కబీర్ సింగ్ దుమ్ముదులిపింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా 20 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. షాహిద్ కపూర్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఇది.

ఇప్పటివరకు ఇతడి కెరీర్ లో పద్మావత్ సినిమాది హయ్యస్ట్ ఓపెనింగ్. ఆ సినిమాకు తొలి రోజు 18 కోట్ల 21 లక్షల రూపాయల నెట్ వచ్చింది. ఆ రికార్డును కబీర్ సింగ్ క్రాస్ చేసింది. మరోవైపు ఇవాళ్టి నుంచి సినిమాపై ఉన్న నెగెటివ్ టాక్ కూడా పోతుందని మేకర్స్ భావిస్తున్నారు.

తెలుగులో ఎలాగైతే ప్రారంభంలో నెగెటివ్ టాక్ వచ్చి, తర్వాత కల్ట్ మూవీగా నిలిచిందో.. అదే విధంగా హిందీలో కూడా కబీర్ సింగ్ సినిమా కల్ట్ క్లాసిక్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇది ఏ రేంజ్ కు వెళ్తుందనేది సోమవారం నాటికి తేలిపోతుంది.

First Published:  22 Jun 2019 4:38 AM GMT
Next Story