Telugu Global
Cinema & Entertainment

అప్పుడే మరో సినిమాపై కన్నేశాడు

జస్ట్ నిన్ననే సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు కల్యాణ్ రామ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్తుంది. ఇంతలోనే మరో ప్రాజెక్టు చేసే దిశగా పావులు కదుపుతున్నాడు ఈ నందమూరి హీరో. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంపత్ నంది దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. మంచి సబ్జెక్ట్ రాసుకున్నాడు సంపత్ నంది. అది కూడా యాక్షన్ కథ. ఈ కథను గోపీచంద్ లాంటి ఇద్దరుముగ్గురు […]

అప్పుడే మరో సినిమాపై కన్నేశాడు
X

జస్ట్ నిన్ననే సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు కల్యాణ్ రామ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్తుంది. ఇంతలోనే మరో ప్రాజెక్టు చేసే దిశగా పావులు కదుపుతున్నాడు ఈ నందమూరి హీరో. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంపత్ నంది దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

మంచి సబ్జెక్ట్ రాసుకున్నాడు సంపత్ నంది. అది కూడా యాక్షన్ కథ. ఈ కథను గోపీచంద్ లాంటి ఇద్దరుముగ్గురు హీరోలకు వినిపించాడు. వీళ్లలో నాగచైతన్య కూడా ఉన్నాడని టాక్. కానీ ఎవరూ ఓకే చెప్పలేదు. దీనికి కారణం వాళ్లంతా బిజీగా ఉండడమే. తాజాగా కల్యాణ్ రామ్ కు కూడా వినిపించాడు సంపత్ నంది.

కల్యాణ్ రామ్ కు కూడా ఈ యాక్షన్ సబ్జెక్ట్ బాగా నచ్చింది. వెంటనే సంపత్ నందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక్కడ మరో బంపర్ ఆఫర్ ఏంటంటే.. అన్నీ అనుకున్నట్టు జరిగితే తన సొంత బ్యానర్ పైనే ఈ సినిమా చేద్దామని హామీ ఇచ్చాడట కల్యాణ్ రామ్. అలా సంపత్ నందికి నిర్మాతను వెదికే శ్రమను కూడా తప్పించాడు.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు సతీష్ వేగేశ్న సినిమా పూర్తయిన తర్వాతే సంపత్ నంది సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే, సంపత్ నంది తనను కలవడానికంటే ముందే సతీష్ వేగేశ్న సినిమాకు బల్క్ గా కాల్షీట్లు ఇచ్చాడు కల్యాణ్ రామ్.

First Published:  21 Jun 2019 9:00 PM GMT
Next Story