Telugu Global
National

వెంకయ్య కోసం పత్రికల విన్యాసాలు....

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలుమార్లు ఫిరాయింపులపై ప్రసంగాలు చేశారు. ఎవరైనా ఫిరాయిస్తే తక్షణం వేటు వేయాలని కోరుతూ వచ్చారు. పార్టీలు మారడం తప్పు కాదు అని… అలా మారాలి అనుకుంటే రాజీనామాలు చేసి పోవాలని కొద్ది రోజుల క్రితం కూడా వెంకయ్యనాయుడు స్పూర్తి ప్రసంగం చేశారు. ఇంతలో టీడీపీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు రూపంలో వెంకయ్యనాయుడికే పరీక్ష ఎదురైంది. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసిన వెంకయ్యనాయుడు… టీడీపీ ఎంపీలపైన వేటు వేస్తారా లేదా అని దేశం ఎదురుచూసింది. […]

వెంకయ్య కోసం పత్రికల విన్యాసాలు....
X

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలుమార్లు ఫిరాయింపులపై ప్రసంగాలు చేశారు. ఎవరైనా ఫిరాయిస్తే తక్షణం వేటు వేయాలని కోరుతూ వచ్చారు. పార్టీలు మారడం తప్పు కాదు అని… అలా మారాలి అనుకుంటే రాజీనామాలు చేసి పోవాలని కొద్ది రోజుల క్రితం కూడా వెంకయ్యనాయుడు స్పూర్తి ప్రసంగం చేశారు.

ఇంతలో టీడీపీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు రూపంలో వెంకయ్యనాయుడికే పరీక్ష ఎదురైంది. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసిన వెంకయ్యనాయుడు… టీడీపీ ఎంపీలపైన వేటు వేస్తారా లేదా అని దేశం ఎదురుచూసింది. కానీ ఫిరాయింపు ఎంపీలు బీజేపీలో విలీనం అయిపోయారని రాజ్యసభ వర్గాలు ప్రకటించాయి. రాజ్యసభ వెబ్‌సైట్‌లో టీడీపీ రాజ్యసభ నలుగురు ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తించేశారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ… ఈ అంశంపై ఇప్పటికి కూడా వెంకయ్యనాయుడు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. టీడీపీ అనుకూల పత్రికలు అయితే అసలు వెంకయ్యనాయుడికి తెలియకుండానే ఈ ఫిరాయింపులకు ముద్రపడిపోయిందన్న భావన కలిగించే ప్రయత్నం చేశాయి. వెంకయ్యనాయుడి నుంచి ఉత్తర్వులు రాకపోయినా రాజ్యసభ వెబ్‌సైట్‌లో నలుగురు ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తించేశారని టీడీపీ పెద్ద పత్రిక వివరించింది.

వెంకయ్యనాయుడు నుంచి ఉత్తర్వులు రాకపోయినా రాజ్యసభ వర్గాలు విలీనం పూర్తయినట్టే అని ప్రకటించాయని చెప్పడం అంటే… వెంకయ్యనాయుడు ప్రమేయం లేకుండానే రాజ్యసభ వ్యవస్థ పనిచేస్తోంది భావించాలా?. లేదంటే వెంకయ్యనాయుడు ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకుండా తక్షణం బీజేపీలో కలిపేశారన్న విమర్శలు రాకుండా ఉండే జాగ్రత్తలో భాగంగానే టీడీపీ పత్రిక ఇలా వెంకయ్యనాయుడు నుంచి ఉత్తర్వులు రాకముందే వేరే వాళ్లు ఇదంతా చేశారని నమ్మించేందుకు ప్రయత్నించిందా అన్నది తెలియాలి.

First Published:  22 Jun 2019 4:46 AM GMT
Next Story