Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ లో కనిపించనున్న ప్రముఖ యాంకర్?

ఇప్పటికే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్-3 గురించిన బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి. ఒక ప్రముఖ యాంకర్ బిగ్ బాస్ సీజన్-3 కి రాబోతోందని సమాచారం అందుతోంది. ఆమె ఎవరో కాదు లాస్య మంజునాథ్. పెళ్లి తరువాత బుల్లి తెరకు దూరంగా ఉంటున్న […]

బిగ్ బాస్ లో కనిపించనున్న ప్రముఖ యాంకర్?
X

ఇప్పటికే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్-3 గురించిన బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి. ఒక ప్రముఖ యాంకర్ బిగ్ బాస్ సీజన్-3 కి రాబోతోందని సమాచారం అందుతోంది. ఆమె ఎవరో కాదు లాస్య మంజునాథ్. పెళ్లి తరువాత బుల్లి తెరకు దూరంగా ఉంటున్న ఈమె ‘లాస్య టాక్స్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో కాంటాక్ట్ లోనే ఉంది.

ఈ మధ్యనే ఒక బిడ్డ కు జన్మనిచ్చిన ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొనబోతోంది అంటూ పుకార్లు బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

నాగార్జున బిగ్ బాస్ -3 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్-3 కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జులై లో ప్రారంభం కానున్న బిగ్ బాస్-3 కాంటెస్టంట్స్ గురించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  23 Jun 2019 12:55 AM GMT
Next Story