Telugu Global
NEWS

బాబు గారూ.... మా పొలాలకు దారేది?

అది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం.. కృష్ణ నది ఒడ్డున అక్రమంగా విలాసవంతంగా నిర్మించిన భవనం. అయితే 2014 నుంచి చంద్రబాబు సీఎం కావడంతో ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించి అటు వైపు ఎవ్వరినీ పోనిచ్చేవారు కాదు.. ఈగ వాలకుండా కాపు కాశారు.. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. అయినా తనకు ఈ ఇల్లే కావాలని.. ఇక్కడే ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. […]

బాబు గారూ.... మా పొలాలకు దారేది?
X

అది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం.. కృష్ణ నది ఒడ్డున అక్రమంగా విలాసవంతంగా నిర్మించిన భవనం. అయితే 2014 నుంచి చంద్రబాబు సీఎం కావడంతో ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.

పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించి అటు వైపు ఎవ్వరినీ పోనిచ్చేవారు కాదు.. ఈగ వాలకుండా కాపు కాశారు..

కానీ ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. అయినా తనకు ఈ ఇల్లే కావాలని.. ఇక్కడే ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు.

అయితే చంద్రబాబు సీఎంగా ఉండగా.. బారికేడ్లతో కట్టుదిట్టం చేసిన పోలీసులు ఇప్పుడు బాబు ప్రతిపక్ష నేతగా ఉండగా కూడా అలానే కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ పరిణామం ఉండవల్లి చుట్టుపక్కల రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

రాత్రి వేళల్లో చంద్రబాబు నివాసం గుండా ఎవరిని వెళ్లనీయడం లేదు. భద్రతా చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇలా చేస్తున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో వీకెండ్ లో ఉన్నా ఇదే తంతు అట.. దీంతో చంద్రబాబు నివాసం అవతల కొండవీటి వాగుకి, కరకట్టకు మధ్య దాదాపు 500 ఎకరాల పంట పొలాలున్నాయి. ఇప్పుడు వానలు పడుతున్న వేళ రైతులు పొలాలకు నీళ్లు పెట్టేందుకు రాత్రి 1 గంట నుంచి 5 గంటల వరకు పొలాలకు వెళ్లడం తప్పనిసరి. అయితే పోలీసులు మాత్రం బాబు నివాసం దగ్గర గుండా వెళ్లనీయడం లేదట..

దీంతో రైతులంతా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి తమ బాధ వెళ్లగక్కారట..
దీంతో ఆయన చంద్రబాబు నివాసమే అక్రమ కట్టడమని.. రైతులను పోలీసులు ఎందుకు ఆపుతున్నారని ఫైర్ అయ్యారట. చంద్రబాబు ప్రభుత్వంలోలా చేస్తే కుదరదని హెచ్చరించారట. మరి పోలీసులు ఆళ్ల మాటలకు స్పందించి బారికేడ్లు తొలగిస్తారా? లేక చంద్రబాబు భద్రత పేరిట రైతులకు ఇబ్బందులు కలిగిస్తారా? అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

First Published:  22 Jun 2019 9:00 PM GMT
Next Story