గోన గన్నారెడ్డి కి గిఫ్ట్ ఇచ్చిన ‘ఆర్య2’ నటుడు

అల్లు అర్జున్ నటించిన సినిమాలలో ‘రుద్రమదేవి’ సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పుకోవచ్చు. అందులో గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

తాజాగా అల్లు అర్జున్ కు ఈ సినిమాలో తన గెటప్ వేసి ఉన్న బొమ్మ గిఫ్ట్ గా వచ్చింది. ఆ గిఫ్టు ఇచ్చింది ఎవరో కాదు నవదీప్. అల్లు అర్జున్, నవదీప్ కలిసి ‘ఆర్య 2’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి స్నేహం కొనసాగుతూనే ఉంది.

తాజాగా నవదీప్ బన్నికి గోన గన్నారెడ్డి బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

“ఔ.. గన్నారెడ్డి.. గోనగన్నారెడ్డి.. నాకు వచ్చిన స్వీటెస్ట్ బహుమతులలో ఇది కూడా ఒకటి. థాంక్యూ బావ నవదీప్. #గోనగన్నారెడ్డి #రుద్రమదేవి” అంటూ ఆ బొమ్మ ఫోటో షేర్ చేశాడు బన్నీ.

అభిమానులు కూడా గిఫ్ట్ చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.