ఒంగోలులో గ్యాంగ్ రేప్… గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు

ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆరుగురు యువకులు బాలికను నాలుగు రోజులుగా బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

గుంటూరు జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలికకు ఒంగోలుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడితో ప్రేమలో పడింది. అతడిని వెతుక్కుంటూ ఒంగోలు వచ్చింది.

ఒంగోలు బస్ స్టేషన్‌లో ఉండగా బాజీ అనే యువకుడు శ్రీకాంత్ తనకు తెలుసంటూ అమ్మాయిని రూంకు తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత బాలికపై అత్యాచారం చేశాడు.

బాజీ స్నేహితులు ఐదుగురు కూడా బాలికపై లైంగిక దాడి చేశారు. నాలుగు రోజులుగా వరుసగా బాలికపై దారుణానికి ఒడిగట్టారు.

బాజీ

ప్రధాన నిందితుడు బాజీ దివ్యాంగుడు. రెండు చేతులూ లేవు. అయినా సరే దారుణానికి నాయకత్వం వహించాడు. ఇతడు ఒక సెల్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. దారుణానికి ఒడిగట్టిన ఆరుగురిలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు.

అయితే వీరి చెర నుంచి తప్పించుకున్న బాలిక నేరుగా ఒంగోలు వన్‌ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.