Telugu Global
NEWS

వివేకా హత్య కేసులో ఆదికి పిలుపు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని పోలీసులు విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. గత ప్రభుత్వం సిట్‌ను నియమించగా… కొత్త ప్రభుత్వం 23 మందితో ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు కోసం నియమించింది. ఈ బృందలో నలుగురు డీఎస్‌పీలు, ఐదుగులు సీఐలు ఉన్నారు. వీరు పలువురు కీలక నేతల ఫోన్ కాల్ డేటాను సేకరించారు. హత్యకు ముందు వీరంతా ఎవరెవరితో మాట్లాడారు అన్న దానికి సంబంధించి డేటాను సేకరించి దాని […]

వివేకా హత్య కేసులో ఆదికి పిలుపు
X

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని పోలీసులు విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

గత ప్రభుత్వం సిట్‌ను నియమించగా… కొత్త ప్రభుత్వం 23 మందితో ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు కోసం నియమించింది. ఈ బృందలో నలుగురు డీఎస్‌పీలు, ఐదుగులు సీఐలు ఉన్నారు.

వీరు పలువురు కీలక నేతల ఫోన్ కాల్ డేటాను సేకరించారు. హత్యకు ముందు వీరంతా ఎవరెవరితో మాట్లాడారు అన్న దానికి సంబంధించి డేటాను సేకరించి దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పలువురు కీలక నేతలకు ఫోన్లు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తున్నారు పోలీసులు.

ఇలా ఫోన్ కాల్ అందుకున్న వారిలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా ఉన్నారు. డీఎస్‌పీ ఫోన్ చేసి పులివెందుల పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదినారాయణరెడ్డిని ఆదేశించారు.

పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డికి కూడా పోలీసులు ఫోన్ చేసి పీఎస్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రముఖ దిన పత్రిక ప్రచురించింది.

ఆదినారాయణరెడ్డి, సతీష్ రెడ్డిల ఫోన్ కాల్ డేటాను ఇప్పటికే పోలీసులు సేకరించారు. టీడీపీ, వైసీపీ అన్న తేడా లేకుండా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మొత్తం మీద ఆదినారాయణరెడ్డికి, సతీష్‌ రెడ్డికి డీఎస్‌పీ ఫోన్ చేసి పులివెందుల పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

First Published:  23 Jun 2019 12:03 AM GMT
Next Story