Telugu Global
NEWS

ప్రపంచకప్ లో భారత్ విజయాల హాఫ్ సెంచరీ

అప్ఘనిస్థాన్ పై గెలుపుతో 50 విజయాల రికార్డు  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాతి స్థానంలో భారత్ ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత్ మరో ఘనత సాధించింది. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో అఫ్ఘనిస్థాన్ తో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ వరకూ…50 విజయాలు సాధించిన మూడో జట్టుగా నిలిచింది. సౌతాంప్టన్ లోని హాంప్ షైర్ బౌల్ వేదికగా ముగిసిన లీగ్ మ్యాచ్ లో పసికూన అఫ్ఘనిస్థాన్ పై 10 పరుగుల తో […]

ప్రపంచకప్ లో భారత్ విజయాల హాఫ్ సెంచరీ
X
  • అప్ఘనిస్థాన్ పై గెలుపుతో 50 విజయాల రికార్డు
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాతి స్థానంలో భారత్

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత్ మరో ఘనత సాధించింది. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో అఫ్ఘనిస్థాన్ తో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ వరకూ…50 విజయాలు సాధించిన మూడో జట్టుగా నిలిచింది.

సౌతాంప్టన్ లోని హాంప్ షైర్ బౌల్ వేదికగా ముగిసిన లీగ్ మ్యాచ్ లో పసికూన అఫ్ఘనిస్థాన్ పై 10 పరుగుల తో నెగ్గడం ద్వారా…
50 ప్రపంచకప్ విజయాల రికార్డును చేరుకొంది.

భారత్ మొత్తం 79 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో 50 విజయాలు, 27 పరాజయాలు, రెండు ఫలితం తేలని మ్యాచ్ ల రికార్డుతో.. మూడో స్థానంలో నిలిచింది.

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా…

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ఘనతను ఆస్ట్రేలియా సొంతం చేసుకొంది. ప్రస్తుత 2019 ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో.. అప్ఘనిస్థాన్ తో ముగిసిన పోటీ వరకూ…90 మ్యాచ్ లు ఆడిన కంగారూ టీమ్…67 విజయాలు, 21 పరాజయాలు, ఫలితం తేలని రెండుమ్యాచ్ ల రికార్డుతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రెండో స్థానంలో న్యూజిలాండ్…

గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్…విండీస్ తో ముగిసిన లీగ్ మ్యాచ్ వరకూ ఆడిన 84 మ్యాచ్ ల్లో 52 విజయాలు, 30 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్ రికార్డుతో ఉంది.

ప్రపంచ 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియాకు ఐదుసార్లు ప్రపంచ టైటిల్ సాధించిన ఘనత ఉంటే..భారత్ రెండుసార్లు విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ మాత్రం.. రన్నరప్ స్థానాలతోనే సరిపెట్టుకొంటూ వస్తోంది.

First Published:  23 Jun 2019 3:55 AM GMT
Next Story