Telugu Global
NEWS

కొంటే బలపడం.. మేమూ తెచ్చాం 23 మందిని.. ఏమైంది?..భయంకరంగా పోయాం...

నేతలను కొని తెచ్చుకుంటే బలపడుతాం అనుకోవడం భ్రమ అన్నారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. బీజేపీలోకి టీడీపీ ఎంపీలు వెళ్లిన నేపథ్యంలో స్పందించిన ఆయన… నేతలను కొనడం వల్ల బలం వస్తుందన్నది సరైనది కాదన్నారు. ”మేము కూడా 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చాం. ఏమైంది?. ప్రభుత్వం పోయింది. పోవడం కూడా భయంకరంగా ప్రభుత్వం పోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏం చేయగలిగారు?.” అని యనమల వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను తొలి నుంచి కూడా చెబుతున్నామన్నారు. బీజేపీ ఇలాగే […]

కొంటే బలపడం.. మేమూ తెచ్చాం 23 మందిని.. ఏమైంది?..భయంకరంగా పోయాం...
X

నేతలను కొని తెచ్చుకుంటే బలపడుతాం అనుకోవడం భ్రమ అన్నారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. బీజేపీలోకి టీడీపీ ఎంపీలు వెళ్లిన నేపథ్యంలో స్పందించిన ఆయన… నేతలను కొనడం వల్ల బలం వస్తుందన్నది సరైనది కాదన్నారు.

”మేము కూడా 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చాం. ఏమైంది?. ప్రభుత్వం పోయింది. పోవడం కూడా భయంకరంగా ప్రభుత్వం పోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏం చేయగలిగారు?.” అని యనమల వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను తొలి నుంచి కూడా చెబుతున్నామన్నారు. బీజేపీ ఇలాగే బయటి నుంచి తెచ్చుకుని బలపడాలనుకుంటే సరైనది కాదన్నారు.

ప్రజల్లో బలం ఉన్నప్పుడే ఇలాంటివి పనిచేస్తాయన్నారు. ఫిరాయింపుల వల్ల పార్టీలు బలపడుతాయంటే తాను నమ్మబోనన్నారు. టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని… అంత ఓటును ఒక శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ తీసుకోవడం అయ్యే పని కాదన్నారు యనమల.

ఫిరాయింపులపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ చేయాలన్నారు. గతంలో వైసీపీ కూడా ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు ఇచ్చిందని.. కానీ స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదన్నారు. దాని వల్లే వైసీపీకి కోపం ఉందన్నారు.

First Published:  22 Jun 2019 9:44 PM GMT
Next Story