Telugu Global
Cinema & Entertainment

డబుల్ దిమాక్ బుర్రకథ

ఆది హీరోగా నటించిన బుర్రకథ ట్రయిలర్ రిలీజైంది. ముందుగా వెంకటేష్ చేతుల మీదుగా ట్రయిలర్ ను లాంఛ్ చేయించారు. ఆ తర్వాత మీడియాను ఆహ్వానించి మరో పెద్ద కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో హీరోకు రెండు బుర్రలు. అంటే ఒకే తరలో రెండు బ్రెయిన్స్ అన్నమాట. అందుకే ఇలా ట్రయిలర్ లాంఛ్ ను కూడా 2 రకాలుగా నిర్వహించారని అనుకోవాలి. ఇక ట్రయిలర్ విషయానికొస్తే, సినిమా పూర్తి వినోదభరితంగా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది. రెండు బ్రెయిన్స్ […]

డబుల్ దిమాక్ బుర్రకథ
X

ఆది హీరోగా నటించిన బుర్రకథ ట్రయిలర్ రిలీజైంది. ముందుగా వెంకటేష్ చేతుల మీదుగా ట్రయిలర్ ను లాంఛ్ చేయించారు. ఆ తర్వాత మీడియాను ఆహ్వానించి మరో పెద్ద కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో హీరోకు రెండు బుర్రలు. అంటే ఒకే తరలో రెండు బ్రెయిన్స్ అన్నమాట. అందుకే ఇలా ట్రయిలర్ లాంఛ్ ను కూడా 2 రకాలుగా నిర్వహించారని అనుకోవాలి.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే, సినిమా పూర్తి వినోదభరితంగా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది. రెండు బ్రెయిన్స్ ఉన్న హీరో ఏ మెదడు వర్క్ చేస్తే దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ మార్చుకుంటాడన్నమాట. ఇందులో ఒకటి క్లాస్ క్యారెక్టర్ అయితే, ఇంకోటి పక్కా మాస్ క్యారెక్టర్ అన్నమాట. తన కెరీర్ లో ఆది చేసిన ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ ఇదే.

ఈ సినిమాతో డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మార్కెట్ పూర్తయింది. వింటేజ్ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకోగా, జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది. అలా టేబుల్ ప్రాఫిట్ తో సాఫీగా థియేటర్లలోకి వస్తోంది బుర్రకథ సినిమా. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా ఇది థియేటర్లలోకి రానుంది.

Here is the #BurraKatha Theatrical Trailer.. #AbhiRam ?? Hope u all like it.. And let me know in the comments ?

Posted by Aadi on Sunday, 23 June 2019

First Published:  24 Jun 2019 5:35 AM GMT
Next Story