Telugu Global
Cinema & Entertainment

డబ్బింగ్ కి మెగా హీరోలా? అక్కినేని హీరోలా?

 ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ వారు ఆనిమేటెడ్ సినిమాలు తీయడంలో ముందుంటారు. తాజాగా 1994లో విడుదలైన ‘లయన్ కింగ్’ సినిమాని ఇప్పుడు 3 డి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పలు భారతీయ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. సినిమాలో ముసఫా, సింబా అంటూ తండ్రి కొడుకు పాత్రలు ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం నిజజీవితంలో కూడా తండ్రి కొడుకులు ఈ పాత్రలకు డబ్బింగ్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. హిందీ లో షారుక్ ఖాన్ మరియు అతని […]

డబ్బింగ్ కి మెగా హీరోలా? అక్కినేని హీరోలా?
X

ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ వారు ఆనిమేటెడ్ సినిమాలు తీయడంలో ముందుంటారు. తాజాగా 1994లో విడుదలైన ‘లయన్ కింగ్’ సినిమాని ఇప్పుడు 3 డి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పలు భారతీయ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

సినిమాలో ముసఫా, సింబా అంటూ తండ్రి కొడుకు పాత్రలు ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం నిజజీవితంలో కూడా తండ్రి కొడుకులు ఈ పాత్రలకు డబ్బింగ్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. హిందీ లో షారుక్ ఖాన్ మరియు అతని తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబుతుండగా, మలయాళంలో మోహన్ లాల్ మరియు అతని కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ డబ్బింగ్ చెప్పనున్నారు.

మరి తెలుగులో ఏ తండ్రీ కొడుకులు ఈ సినిమాకి డబ్బింగ్ చేయబోతున్నారు అనే విషయంపై గత కొంతకాలంగా పెద్ద చర్చ నడుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పబోతున్నారు అంటుండగా, మరికొందరు నాగార్జున, నాగచైతన్య డబ్బింగ్ చెప్పనున్నారు అని పుకార్లు సృష్టించారు.

వీటిలో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 19న విడుదల కానుంది.

First Published:  24 Jun 2019 5:17 AM GMT
Next Story