Telugu Global
Cinema & Entertainment

ఆగిపోయిన సినిమాని మళ్ళీ మొదలు పెడుతున్న.... కృష్ణవంశీ

రొటీన్ కమర్షియల్ కథలకు దూరంగా సరి కొత్త సినిమాలు తీయడంలో ముందుండే దర్శకుడు కృష్ణవంశీ గత కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ‘చందమామ’ సినిమా తర్వాత కృష్ణవంశీ కెరీర్లో పెద్దగా హిట్లు ఏమీ లేవు. 2017 లో విడుదలైన ‘నక్షత్రం’ సినిమా కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం కృష్ణవంశీ ‘రుద్రాక్ష’ అనే ఒక సినిమా తీయబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అది ఒక సెమీ ఫాంటసీ సినిమా. […]

ఆగిపోయిన సినిమాని మళ్ళీ మొదలు పెడుతున్న.... కృష్ణవంశీ
X

రొటీన్ కమర్షియల్ కథలకు దూరంగా సరి కొత్త సినిమాలు తీయడంలో ముందుండే దర్శకుడు కృష్ణవంశీ గత కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

‘చందమామ’ సినిమా తర్వాత కృష్ణవంశీ కెరీర్లో పెద్దగా హిట్లు ఏమీ లేవు. 2017 లో విడుదలైన ‘నక్షత్రం’ సినిమా కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

కొన్నాళ్ల క్రితం కృష్ణవంశీ ‘రుద్రాక్ష’ అనే ఒక సినిమా తీయబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అది ఒక సెమీ ఫాంటసీ సినిమా. హీరోయిన్ సెంట్రిక్ కథతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని వార్తలు బయటకు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయింది.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కృష్ణ వంశీ ఈ సినిమాను మళ్ళీ పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. ఇంతకుముందు లాగానే భారీ బడ్జెట్ తో ఈ సినిమా విడుదల కాబోతోంది. బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఒక స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

First Published:  24 Jun 2019 5:11 AM GMT
Next Story