Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ ఓకే... కానీ....

మహర్షి విజయం తర్వాత ఇప్పుడు మహేష్ బాబు ఏ సినిమా చేసినా అందరిలో ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. అయితే తాజాగా మహేష్ హిందీ మీడియా తో ముచ్చటించారు. తన బాలీవుడ్ అరంగేట్రం గురించి మహేష్ మళ్ళీ ఓపెన్ అయ్యారు. ఆయన పని చేయడానికి సిద్ధం అని చెప్తూ నే బిజీ గా ఉన్నాను అని చెప్పడం విశేషం. ఇంతకు ముందే ఎన్నో సార్లు దీని పైన స్పందించిన మహేష్ బాబు మళ్ళీ పింక్ విల్లా వాళ్ళకి ఇచ్చిన […]

బాలీవుడ్ ఓకే... కానీ....
X

మహర్షి విజయం తర్వాత ఇప్పుడు మహేష్ బాబు ఏ సినిమా చేసినా అందరిలో ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. అయితే తాజాగా మహేష్ హిందీ మీడియా తో ముచ్చటించారు. తన బాలీవుడ్ అరంగేట్రం గురించి మహేష్ మళ్ళీ ఓపెన్ అయ్యారు. ఆయన పని చేయడానికి సిద్ధం అని చెప్తూ నే బిజీ గా ఉన్నాను అని చెప్పడం విశేషం.

ఇంతకు ముందే ఎన్నో సార్లు దీని పైన స్పందించిన మహేష్ బాబు మళ్ళీ పింక్ విల్లా వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా మరో సారి క్లారిటీ ఇచ్చాడు.

“రానున్న రెండు సంవత్సరాలు నేను పూర్తిగా బిజీ గా ఉండబోతున్నాను. సినిమాలు ఆల్రెడీ కమిట్ అయ్యాను. అందుకని బాలీవుడ్ అరంగేట్రం గురించి నేను ఇప్పుడే ఏమి ఆలోచించడం లేదు. నేను మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ సినిమాల చుట్టూ పెరిగాను. ఆయన నాకు స్ఫూర్తిదాయకం. బాలీవుడ్ లో చాలా మంది దర్శకులు, హీరోయిన్లు నైపుణ్యం గల వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రోజు వాళ్ళతో పని చేసే అవకాశం వస్తే పని చేయడానికి నేను సిధ్దమే” అని మహేష్ బాబు చెప్పారు.

త్వరలో మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవరు సినిమా లో నటించనున్నారు.

First Published:  24 Jun 2019 1:31 AM GMT
Next Story