Telugu Global
Cinema & Entertainment

మరోసారి బాలీవుడ్ కు పూజాహెగ్డే

బాలీవుడ్ లో ఆమెకు అతి భారీ డిజాస్టర్ పడింది. చివరికి హృతిక్ రోషన్ కూడా ఆమెను కాపాడలేకపోయాడు. అలా బాలీవుడ్ కు దూరమైన పూజా హెగ్డే మరోసారి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సిద్ధమైంది. తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, బాలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేయడానికి ఒప్పుకుంది పూజా హెగ్డే. ఇందులో ఇమ్రాన్ హస్మి, జాన్ అబ్రహాం హీరోలుగా నటించబోతున్నారు. జాకీష్రాఫ్, సునీల్ షెట్టి, […]

మరోసారి బాలీవుడ్ కు పూజాహెగ్డే
X

బాలీవుడ్ లో ఆమెకు అతి భారీ డిజాస్టర్ పడింది. చివరికి హృతిక్ రోషన్ కూడా ఆమెను కాపాడలేకపోయాడు. అలా బాలీవుడ్ కు దూరమైన పూజా హెగ్డే మరోసారి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సిద్ధమైంది. తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, బాలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేయడానికి ఒప్పుకుంది పూజా హెగ్డే. ఇందులో ఇమ్రాన్ హస్మి, జాన్ అబ్రహాం హీరోలుగా నటించబోతున్నారు. జాకీష్రాఫ్, సునీల్ షెట్టి, గుల్షన్ గ్రోహర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించబోతున్నారు. టి-సిరీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ముంబయి సాగ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డేకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆమె కాల్షీట్ల కోసం స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. కానీ ఇంత క్రేజ్ ను వదిలిపెట్టి మరోసారి బాలీవుడ్ కు వెళ్లేందుకు రెడీ అవుతోంది ఈ మంగుళూరు బ్యూటీ. ఈసారి కూడా ఆమెకు బాలీవుడ్ లో చుక్కెదురైతే, ఇక అంతే సంగతులని అంటున్నారు.

First Published:  23 Jun 2019 8:01 PM GMT
Next Story