Telugu Global
NEWS

గ్రాస్ కోర్టు టెన్నిస్ కింగ్ రోజర్ ఫెదరర్

ఎవర్ గ్రీన్ స్టార్ ఖాతాలో 102వ టైటిల్  2019 హాలే టెన్నిస్ విజేత ఫెదరర్  37 ఏళ్ల వయసులోనూ తిరుగులేని రోజర్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కింగ్ రోజర్ ఫెదరర్…తన సుదీర్ఘ కెరియర్ లో మరో ఏటీపీ టూర్ టైటిల్ సాధించాడు. తన రికార్డును తానే అధిగమిస్తూ దూసుకుపోతున్నాడు. 2019 వింబుల్డన్ టైటిల్ కు సన్నాహకంగా జరిగిన ఏటీపీ హాలే ఫైనల్లో తొమ్మిదిసార్లు విజేత ఫెదరర్ వరుస సెట్ల విజయం సాధించాడు. బెల్జియం ప్లేయర్ డేవిడ్ గోఫిన్ […]

గ్రాస్ కోర్టు టెన్నిస్ కింగ్ రోజర్ ఫెదరర్
X
  • ఎవర్ గ్రీన్ స్టార్ ఖాతాలో 102వ టైటిల్
  • 2019 హాలే టెన్నిస్ విజేత ఫెదరర్
  • 37 ఏళ్ల వయసులోనూ తిరుగులేని రోజర్

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కింగ్ రోజర్ ఫెదరర్…తన సుదీర్ఘ కెరియర్ లో మరో ఏటీపీ టూర్ టైటిల్ సాధించాడు. తన రికార్డును తానే అధిగమిస్తూ దూసుకుపోతున్నాడు.

2019 వింబుల్డన్ టైటిల్ కు సన్నాహకంగా జరిగిన ఏటీపీ హాలే ఫైనల్లో తొమ్మిదిసార్లు విజేత ఫెదరర్ వరుస సెట్ల విజయం సాధించాడు.

బెల్జియం ప్లేయర్ డేవిడ్ గోఫిన్ తో ముగిసిన పోరులో ఫెదరర్ 7-6, 6-1తో విజేతగా నిలిచాడు. పదోసారి హాలే టైటిల్ విజేతగా నిలిచాడు.

21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురి…

ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ఫెదరర్..మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే 2019 వింబుల్డన్ టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ప్రొఫెషనల్ టెన్నిస్ చరిత్రలో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఫెదరర్ అగ్రస్థానంలో నిలిస్తే…క్లేకోర్టు టెన్నిస్ మొనగాడు రాఫెల్ నడాల్ 18 టైటిల్స్ తో రెండు, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ 15 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.

అంతేకాదు…హాలే గ్రాస్ కోర్టు టోర్నీలో విజేతగా నిలవడం ఫెదరర్ కు రికార్డు స్థాయిలో ఇది పదోసారి.

First Published:  23 Jun 2019 10:00 PM GMT
Next Story