Telugu Global
Cinema & Entertainment

స్టుడియో రౌండప్ (24-06-2019)

హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుందనే కారణంతోనే విజయ్ దేవరకొండ, తానా సభలకు వెళ్లడం లేదు. మరో వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఈ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత చెన్నైలో కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. సాహో సాహో యూనిట్ ప్రస్తుతం ఆస్ట్రియాలో ఉంది. అక్కడి అందమైన లొకేషన్లలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ పిక్చరైజ్ […]

స్టుడియో రౌండప్ (24-06-2019)
X

హీరో

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుందనే కారణంతోనే విజయ్ దేవరకొండ, తానా సభలకు వెళ్లడం లేదు. మరో వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఈ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత చెన్నైలో కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు.

సాహో

సాహో యూనిట్ ప్రస్తుతం ఆస్ట్రియాలో ఉంది. అక్కడి అందమైన లొకేషన్లలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇదే ఆఖరి షెడ్యూల్. ఈ పాటతో టోటల్ షూటింగ్ పూర్తయిపోతుంది. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత రామోజీ ఫిలింసిటీలో 3 రోజుల ప్యాచ్ వర్క్ మాత్రం పెండింగ్ ఉంటుంది.

మన్మధుడు-2

నాగార్జున నటిస్తున్న మన్మధుడు-2 షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ అందమైన ఇంటిసెట్ నిర్మించారు. ప్రస్తుతం ఆ సెట్ లోనే హీరోతో పాటు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

గ్యాంగ్ లీడర్

నాని హీరోగా నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని తూప్రాన్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో నానిపై ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఈ సినిమాలో ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. విలన్ గా కార్తికేయ నటిస్తున్నాడు. ఆగస్ట్ 30న గ్యాంగ్ లీడర్ ను విడుదల చేయబోతున్నారు

సైరా

చిరంజీవి 151వ సినిమా సైరా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం కోకాపేటలో సినిమాకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ షూట్ నడుస్తోంది. చిరంజీవి, బ్రహ్మాజీ, తమన్న మధ్య కొన్ని సీన్స్ తీస్తున్నారు. మరో వారం రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.

బన్నీ-త్రివిక్రమ్ మూవీ

ఈ సినిమాకు సంబంధించి ఓవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చేనెల 5 నుంచి పొలాచ్చిలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. అది 20 రోజుల పాటు ఉంటుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  24 Jun 2019 11:26 AM GMT
Next Story