Telugu Global
NEWS

ప్రపంచకప్ లో హ్యాట్రిక్ హీరోలు

చేతన్ శర్మ నుంచి మహ్మద్ షమీ వరకూ.. 1975 నుంచి 2019 ప్రపంచకప్ వరకూ 10 హ్యాట్రిక్ లు రెండుసార్లు హ్యాట్రిక్ బౌలర్ లాసిత్ మలింగ ప్రపంచకప్ అంటే..బౌండ్రీలు, సిక్సర్లు…సెంచరీలు మాత్రమే కాదు… ఫాస్ట్ బౌలర్ల డెడ్లీ యార్కర్లు, స్పిన్ బౌలర్ల ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, టాప్ స్పిన్, గుగ్లీ మ్యాజిక్ కూడా. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రారంభమైన 2019 ప్రపంచకప్ లో బ్యాట్స్ మన్ చెలరేగిపోడం ఖాయమని…వివిధ జట్ల బౌలర్లకు కష్టాలు తప్పవని […]

ప్రపంచకప్ లో హ్యాట్రిక్ హీరోలు
X
  • చేతన్ శర్మ నుంచి మహ్మద్ షమీ వరకూ..
  • 1975 నుంచి 2019 ప్రపంచకప్ వరకూ 10 హ్యాట్రిక్ లు
  • రెండుసార్లు హ్యాట్రిక్ బౌలర్ లాసిత్ మలింగ

ప్రపంచకప్ అంటే..బౌండ్రీలు, సిక్సర్లు…సెంచరీలు మాత్రమే కాదు… ఫాస్ట్ బౌలర్ల డెడ్లీ యార్కర్లు, స్పిన్ బౌలర్ల ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, టాప్ స్పిన్, గుగ్లీ మ్యాజిక్ కూడా.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రారంభమైన 2019 ప్రపంచకప్ లో బ్యాట్స్ మన్ చెలరేగిపోడం ఖాయమని…వివిధ జట్ల బౌలర్లకు
కష్టాలు తప్పవని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

అయితే… బౌలర్లు మాత్రం సకల అస్త్రాలతో..బ్యాట్స్ మన్ ను బోల్తా కొట్టించడానికి సిద్ధమయ్యారు. హ్యాట్రిక్ లు సాధించడానికి
ఉరకలేస్తున్నారు.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ 28వ మ్యాచ్ లో కాని హ్యాట్రిక్ నమోదు కాలేదు. ఈ ఘనతను భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సాధించాడు.

సౌతాంప్టన్ వేదికగా అఫ్ఘనిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో షమీ ఈ ఘనత సంపాదించాడు.

హ్యాట్రిక్ లు అంత తేలికకాదు…

1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2019 ప్రపంచకప్ మొదటి 28 రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల వరకూ జరిగిన మొత్తం 12 టోర్నీల్లో కేవలం 10 హ్యాట్రిక్ లు మాత్రమే నమోదయ్యాయి.

చేతన్ శర్మ టు మహ్మద్ షమీ….

1975లో ప్రపంచకప్ ప్రారంభమైనా…తొలి హ్యాట్రిక్ మాత్రం…భారత్ వేదికగా 1987లో జరిగిన ప్రపంచకప్ లో మాత్రం నమోదుకాలేదు.

నాగపూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ…ప్రపంచకప్ చరిత్రలోనే మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

న్యూజిలాండ్ ఆటగాళ్లు ..రూథర్ ఫోర్డ్, ఇయాన్ స్మిత్, ఇవాన్ చాట్ ఫీల్డ్ ..మూడు వరుస బంతుల్లో చేతన్ శర్మ బౌలింగ్ లో అవుటయ్యారు.

1999లో రెండో హ్యాట్రిక్…

ప్రపంచకప్ లో రెండో హ్యాట్రిక్ కోసం 1999 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. 1999 ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వే తో జరిగిన
పోటీలో పాక్ ఆఫ్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ ఈ హ్యాట్రిక్ సాధించాడు.

2003లో రెండు హ్యాట్రిక్ లు..

సౌతాఫ్రికా వేదికగా ముగిసిన 2003 ప్రపంచకప్ లో ఏకంగా రెండు హ్యాట్రిక్ లు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ పై శ్రీలంక పేసర్ చమిందా వాస్ హ్యాట్రిక్ కెన్యాపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ లు నమోదు చేశారు.

2007 ప్రపంచకప్ లో మలింగ మ్యాజిక్…

2007 ప్రపంచకప్ లో .. సౌతాఫ్రికా పై శ్రీలంక యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత జరిగిన 2011
ప్రపంచకప్ లో రెండు హ్యాట్రిక్ లు నమోదయ్యాయి.

నెదర్లాండ్స్ పై కరీబియన్ ఫాస్ట్ బౌలర్ ఖేమర్ రోచ్, కెన్యాపై శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలింగ హ్యాట్రిక్ లు సాధించారు. ప్రపంచకప్ చరిత్రలో రెండు హ్యాట్రిక్ లు సాధించిన మొనగాడు లాసిత్ మలింగ మాత్రమే.

2015లో రెండు హ్యాట్రిక్ లు ఇక..2015 ప్రపంచకప్ లో సైతం రెండు హ్యాట్రిక్ లు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ ఫిన్ , శ్రీలంకపై సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ జెపీ డుమ్నీ హ్యాట్రిక్ లు సాధించారు.

మరి.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ హ్యాట్రిక్ తో బోణీ కొట్టాడు. మిగిలిన మ్యాచ్ ల్లో మరెన్ని హ్యాట్రిక్ లు నమోదుకాగలవన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  23 Jun 2019 10:10 PM GMT
Next Story