సిక్స్ ప్యాక్ వార్తల్లో నిజం లేదు

మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడంటూ వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి.

వాటిలో ఎలాంటి నిజం లేదన యూనిట్ తాజాగా స్పష్టంచేసింది. మహేష్ బాబు ఇందులో కేవలం ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని, సిక్స్ ప్యాక్ చూపించే సందర్భం రాదని తెలిపారు.

గతంలో వన్-నేనొక్కడినే సినిమా కోసం అమెరికా జిమ్ ట్రయినర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు మహేష్. దాంతో ఆ సినిమా కోసం మహేష్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కేవలం ఫిట్ నెస్ కోసమే మహేష్ జిమ్ బాట పట్టాడని జనాలకు తర్వాత అర్థమైంది. ఈసారి కూడా ఆర్మీ ఆఫీసర్ పాత్ర కోసం ఫిట్ గా తయారయ్యేందుకే మహేష్ కసరత్తులు స్టార్ట్ చేశాడు తప్ప సిక్స్ ప్యాక్ కోసం కాదు.

వచ్చేనెల 5 నుంచి సరిలేరు నీకెవ్వరు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కశ్మీర్ లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేశారు. రష్మిక హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషించనున్నారు.