Telugu Global
International

చోక్సీ పౌరసత్వం రద్దు చేసిన ఆంటిగ్వా

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చోక్సీని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమం అవుతోంది. ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని నిర్ణయించుకున్నారు. నీరవ్‌ మోడీతో పాటు ఈ స్కాంలో చోక్సీ నిందితుడు. 13,500 కోట్ల స్కాంకు వీరు పాల్పడ్డారు. గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటకు రావడంతో నీరవ్ మోడీ, చోక్సీ ఇద్దరూ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వాలో దాక్కున్నాడు. దాంతో ఈడీ […]

చోక్సీ పౌరసత్వం రద్దు చేసిన ఆంటిగ్వా
X

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చోక్సీని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమం అవుతోంది. ప్రస్తుతం చోక్సీ ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని నిర్ణయించుకున్నారు. నీరవ్‌ మోడీతో పాటు ఈ స్కాంలో చోక్సీ నిందితుడు. 13,500 కోట్ల స్కాంకు వీరు పాల్పడ్డారు.

గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటకు రావడంతో నీరవ్ మోడీ, చోక్సీ ఇద్దరూ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వాలో దాక్కున్నాడు.

దాంతో ఈడీ ఆ దేశంతో చర్చలు జరిపింది. భారత్‌ ఒత్తిడికి తలొగ్గిన ఆంటిగ్వా ప్రధాని చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేసింది. వైద్యం కోసమే తాను ఇక్కడికి వచ్చానని చోక్సీ వాదించాడు. దాంతో చోక్సీని తీసుకొచ్చేందుకు ఎయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఈడీ అధికారులు ప్రకటించారు.

First Published:  25 Jun 2019 2:09 AM GMT
Next Story