Telugu Global
CRIME

రాజధానిలో డ్రగ్స్ కలకలం... ముగ్గురు విదేశీయుల అరెస్టు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ రాజ్యమేలుతోంది. విదేశీయుల నుంచి నగరానికి సరఫరా అవుతున్న డ్రగ్స్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలే లక్ష్యంగా సరఫరా అవుతున్నాయి. సోమవారం రాత్రి నగరంలో భారీగా కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలు ప్రాంతాలలో కొకైన్ సరఫరా చేస్తున్న ముగ్గురు విదేశీయులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు నైజీరియన్లు కాగా, ఒకరు ఐవరీకోస్ట్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ముగ్గురి నుంచి 20 […]

రాజధానిలో డ్రగ్స్ కలకలం... ముగ్గురు విదేశీయుల అరెస్టు
X

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ రాజ్యమేలుతోంది. విదేశీయుల నుంచి నగరానికి సరఫరా అవుతున్న డ్రగ్స్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలే లక్ష్యంగా సరఫరా అవుతున్నాయి.

సోమవారం రాత్రి నగరంలో భారీగా కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలు ప్రాంతాలలో కొకైన్ సరఫరా చేస్తున్న ముగ్గురు విదేశీయులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు నైజీరియన్లు కాగా, ఒకరు ఐవరీకోస్ట్ కు చెందిన వారిగా గుర్తించారు.

ఈ ముగ్గురి నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 254 గ్రాముల కొకైన్, 3.2 లక్షల రూపాయల నగదు, మూడు వాహనాలు, నాలుగు మొబైల్ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

గడచిన కొంత కాలంగా నగరంలో కొకైన్, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు భారీగా సరఫరా అవుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు నగరంలో భారీగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారంతో గోల్కండ సమీపంలోని ఖాదర్ బాగ్ లోని ఓ ఇంట్లో ఈ డ్రగ్స్ దందా జరుగుతున్నట్లుగా గుర్తించారు. దీంతో ఈ ఇంటిపై సోమవారం నాడు దాడులు చేసి ముగ్గురు విదేశీయులతో పాటు భారీ ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ డ్రగ్స్ దందాలో ఐవరీకోస్ట్ కు చెందిన జైదీ పాస్కల్ ఈ ఏడాది జనవరి నెల నుంచి ఇక్కడే ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అంతకు ముందు లక్కీ అనే నైజేరియన్ మూడేళ్ల క్రితం ఈ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రగ్స్ దందా చేసాడని, అతను నైజీరియా వెళ్లిపోతూ ఈ దందాను పాస్కల్ కు అప్పగించాడని పోలీసుల విచారణలో బయటపడింది.

లక్కీ సహచరుడైన మరో నైజీరియన్ డాండీ ముంబైలో ఉంటూ ఇక్కడున్న పాస్కల్ కు కొకైన్ తో పాటు ఇతర డ్రగ్స్ ను సరఫరా చేసే వాడని, వాటిని ఇక్కడ విక్రయించిన పాస్కల్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును ముంబైకి పంపించే వాడని పోలీసులు చెబుతున్నారు.

ముంబై నుంచి సరుకు తీసుకువచ్చిన డాండీ, బెంగళూరు నుంచి వచ్చిన మరో నైజీరియన్ ఎబుకా మనిషీ చీమా గుడ్ లక్ లు కూడా హైదరాబాద్ వచ్చి పాతబస్తీలోని ఖాదర్ బాగ్ లో ఉంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం నాడు ఆ ఇంటిపై దాడి చేసి ఈ ముగ్గురు విదేశీయులను, వారి నుంచి భారీ స్థాయిలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

First Published:  24 Jun 2019 9:00 PM GMT
Next Story