కల్కి ట్రయిలర్ రివ్యూ

గరుడవేగ హిట్ అవ్వడంతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చాడు రాజశేఖర్. అతడు నటించిన కల్కి సినిమాపై మార్కెట్లో భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా రిలీజైన కమర్షియల్ టీజర్ హిట్ అవ్వడంతో ఈ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా హానెస్ట్ ట్రయిలర్ ను విడుదల చేశారు. ఇది కూడా బాగుంది.

ఈరోజు రిలీజైన కల్కి ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కథను దాచకుండా లైన్ చెబుతూనే, శేఖర్ బాబును ఎవరు చంపారనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రయిలర్ ను కట్ చేశారు. చేతన్ భరధ్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ కు సరిగ్గా సెట్ అయింది. ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా సాగబోతోందనే విషయం ట్రయిలర్ తో చెప్పకనే చెప్పేశారు.

సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు రాజశేఖర్. అదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాను ఈ వారాంతం థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ బిజినెస్ లు పూర్తయ్యాయి. సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేస్తున్నారు.