సరికొత్త లుక్ తో వస్తున్న వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్… జాగ్రత్తగా సరికొత్త కథలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ‘వాల్మీకి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం 19 సెకండ్ లు నిడివి ఉన్న ఈ వీడియో చూస్తే సినిమాలో వరుణ్ తేజ్ లుక్ ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. గుబురు గడ్డంతో, చేతిలో గన్ తో ఒక గ్యాంగ్ స్టర్ లాగా కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్.

కేవలం వరుణ్ తేజ్ మాస్ లుక్ చూస్తేనే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రీ టీజర్ అదిరిపోయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అధర్వ మురళి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పతాకంపై రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరుణ్ తేజ్ తన కెరియర్ లో మొట్ట మొదటి సారిగా ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.