Telugu Global
NEWS

బాబుతో భేటీకి ఆ టీడీపీ అసమ్మతివాదులు రాలేదు

కాకినాడలో ఇటీవల టీడీపీ సీనియర్ నేత తోట త్రిముర్తులు నేతృత్వంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కాపు నేతలు సమావేశమై బీజేపీలో చేరాలని చర్చలు జరిపినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీరంతా టీడీపీని వీడడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రజావేదిక కూల్చివేత సమయంలో చంద్రబాబు దానిపక్కనే ఉన్న తన నివాసంలో టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆశ్చర్యకరంగా కాకినాడలో సమావేశమైన నేతలు గైర్హాజరు కావడం టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చినట్లయింది. విజయవాడలోనే ఉన్న బోండా […]

బాబుతో భేటీకి ఆ టీడీపీ అసమ్మతివాదులు రాలేదు
X

కాకినాడలో ఇటీవల టీడీపీ సీనియర్ నేత తోట త్రిముర్తులు నేతృత్వంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కాపు నేతలు సమావేశమై బీజేపీలో చేరాలని చర్చలు జరిపినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీరంతా టీడీపీని వీడడం ఖాయమని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ప్రజావేదిక కూల్చివేత సమయంలో చంద్రబాబు దానిపక్కనే ఉన్న తన నివాసంలో టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆశ్చర్యకరంగా కాకినాడలో సమావేశమైన నేతలు గైర్హాజరు కావడం టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చినట్లయింది.

విజయవాడలోనే ఉన్న బోండా ఉమాతో పాటు గోదావరి జిల్లాల్లో ఉన్న తోట త్రిముర్తులు, జ్యోతుల నెహ్రూ, పంచకర్ల రమేష్ బాబులు చంద్రబాబుతో భేటికి వెళ్లకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వీరంతా బాబు ను వ్యతిరేకిస్తూనే కాకినాడలో సమావేశం పెట్టారు. బీజేపీలో చేరికపై చర్చించారు.

అయితే అధికారికంగా మాత్రం టీడీపీని వీడలేదు. ఇప్పుడు బాబు భేటికి దూరం కావడంతో వీరు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబుకు ఇప్పుడంతా దూరమవుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు కమలం గూటికి చేరారు. అంబికాకృష్ణ బీజేపీలో చేరిపోయాడు. ఇప్పుడు కీలక నేతలు బాబు భేటికి డుమ్మా కొట్టడం చూశాక ఆ పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

First Published:  26 Jun 2019 5:31 AM GMT
Next Story