తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ నరసింహారావు

కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పార్టీలో ఎంతో మందిని ఎదగకుండా తొక్కేశాడని మండిపడ్డారు.

సోనియా కుటుంబాన్నే తొక్కేయాలని పీవీ ప్రయత్నించారని చెప్పారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ నరసింహారావు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాబ్రీ మసీదును కూల్చి పీవీ ఘోర తప్పిదం చేశారన్నారు. పీవీ వల్ల మైనార్టీలు కాంగ్రెస్‌కు దూరమయ్యారని మండిపడ్డారు.

ప్రణబ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉందని, అందుకే నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ సభకు వెళ్ళి ప్రణబ్‌ భారతరత్న తెచ్చుకున్నారని, అయితే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాత్రం బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చనందుకే ఆయనను పొగడడం లేదని అన్నారు చిన్నారెడ్డి.