Telugu Global
National

3 ఏండ్లలో 700 మంది ఉగ్రవాదులను ఖతం చేసిన భద్రతా దళాలు

జమ్ము కశ్మీర్‌లో ఎప్పుడు చూసినా ఏదో ఒక చోట ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటూనే ఉంది. గత మూడేండ్లలో ఈ ఘటనలు మరింతగా పెరిగిపోయాయి. దీనిపై లోక్‌సభలో ఒక సభ్యుడు ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గత మూడేండ్లలో జమ్ము కశ్మీర్‌లో జరిగిన పలు ఘటనల్లో 700 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని చెప్పారు. 2016లో 150 మందిని, 2017లో 213 మందిని, 2018లో 257 మందిని.. […]

3 ఏండ్లలో 700 మంది ఉగ్రవాదులను ఖతం చేసిన భద్రతా దళాలు
X

జమ్ము కశ్మీర్‌లో ఎప్పుడు చూసినా ఏదో ఒక చోట ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటూనే ఉంది. గత మూడేండ్లలో ఈ ఘటనలు మరింతగా పెరిగిపోయాయి. దీనిపై లోక్‌సభలో ఒక సభ్యుడు ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

గత మూడేండ్లలో జమ్ము కశ్మీర్‌లో జరిగిన పలు ఘటనల్లో 700 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని చెప్పారు. 2016లో 150 మందిని, 2017లో 213 మందిని, 2018లో 257 మందిని.. హతమార్చగా ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 16 వరకు 113 మందిని చంపినట్లు మంత్రి తెలిపారు.

కాగా, అదే సమయంలో 112 మంది సామాన్య పౌరులు కూడా మరణించారని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాద చర్యలను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించదని.. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

First Published:  25 Jun 2019 8:02 PM GMT
Next Story