మెగాస్టార్ కోసం…. హీరోయిన్ వేటలో కొరటాల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది.

ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాడు కొరటాల. ఎంటర్ టైనింగ్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

చిరంజీవి ఇమేజ్ కి మరియు ఏజ్ కి సరిపడే ఒక హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు వేట మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కోసం కొరటాల ఒక ఫ్రెష్ ఫేస్ ను వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అనుష్క, నయనతార, శృతిహాసన్ వంటి పేర్లు బయటకు వచ్చాయి. కానీ కొరటాల శివ మాత్రం కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నాడట.

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.