అక్టోబర్ నుంచి చిరు-కొరటాల సినిమా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లతో స్టార్ దర్శకుడిగా మారి పోయిన కొరటాల…. చిరంజీవి కోసం మంచి కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కథ, మరియు సినిమాలో చిరంజీవి పాత్ర పై బోలెడు పుకార్లు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మార్చి 25, 2020న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర విషయాల గురించి కాస్ట్ అండ్ క్రూ గురించిన వివరాలు త్వరలో వెలువడనున్నాయి.