రేకులు విప్పుతున్నట్టు కాదు… అవినీతి విప్పుతున్నట్టుగా….

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నిన్నచెప్పనే చెప్పారు. ప్రజావేదిక అనేది బయట చూసే వారికి పెద్ద కట్టడంగా కనిపిస్తోంది గానీ… అంతలేదు … అంతా డొల్లా… స్క్రూలు, బోల్టులు విప్పేసి రేకులు తీసుకెళ్లడమే అని.

ఇప్పుడు అది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. తొలుత చాలా మంది ప్రజావేదికను కూల్చివేయడం అనుకున్నారు.. కానీ ప్రజావేదిక నిర్మాణం మొత్తం రేకులు, ఇనుప స్తంభాలతో ఉండడంతో… ఇప్పుడంతా ప్రజావేదికను కూల్చడం కాదు… విప్పి తీసుకెళ్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొత్తం రేకులు, బయటకు గంభీరంగా కనిపించేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తరహాలో షీట్లు అమర్చేశారు. దాన్ని చూసిన సాధారణ బిల్డర్లు కూడా ఈ నిర్మాణానికి 9 కోట్లు అవసరం లేదు… రెండు కోట్లకు మించి ఖర్చు అయ్యే అవకాశమే లేదంటున్నారు.

ప్రజావేదికలోని రేకులు, బోల్టులు, ఇనుప స్తంభాలు అన్నింటిని చక్కగా మరొక చోటికి తరలిస్తున్నారు. బహుశా నిర్మాణంలోని ఈ డొల్లతనం బయటపడుతుందన్న ఉద్దేశంతో కాబోలు టీడీపీనేతలు ఈ నిర్మాణాన్ని కూల్చడానికి వీల్లేదంటూ దబాయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజావేదిక కట్టడాన్ని విప్పుతుంటే… టీడీపీ ఐదేళ్లలో సాగించిన అవినీతి రూపానికి బట్టలు విప్పుతున్నట్టుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.