బూతులు తిట్టుకున్న గోరంట్ల, సోము వీర్రాజు

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు బూతులు తిట్టుకున్నారు.

కాకినాడలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో అందరి ముందు ఒకరినొకరు తిట్టుకున్నారు. నీవు చెత్త మాట్లాడుతున్నావంటే… నీవే చెత్త మాటలు మాట్లాడుతున్నావ్ అంటూ తిట్టుకున్నారు. ఆ తర్వాత బూతులు తిట్టుకున్నారు.

పౌరసరఫరాల అంశంపై చర్చ జరుగుతుండగా ఇతర అంశాలను గోరంట్ల లేవనెత్తారు. దీంతో సోము వీర్రాజు అడ్డుపడ్డారు. దాంతో గొడవ మొదలైంది.

వైఎస్ హయాంలో మంజూరైన ఇళ్లను కూడా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని సోమువీర్రాజు విమర్శించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి దూషణలకు దిగారు. దాంతో కాసేపు సమావేశంలో వేడి పెరిగింది.