రంగస్థలం సెట్స్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘సైరా నరసింహారెడ్డి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా సెట్స్ ను వాడబోతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ జరిగిన ఏరియాలోనే కొన్ని సెట్స్ వేయించనున్నారు. సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే జరగబోతోంది. ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం  చాలా పేర్లే బయటకు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొరటాల శివ కొత్త నటిని తీసుకోబోతున్నట్లు మరికొందరు అంటున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలోని కాస్ట్ అండ్ క్రూ గురించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.