Telugu Global
Cinema & Entertainment

మహర్షి సెలబ్రేషన్స్ వాయిదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం తో చిత్ర యూనిట్ మహర్షి విజయోత్సవాలని ఘనం గా జరుపుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భం గా 50 రోజుల వేడుక ని […]

మహర్షి సెలబ్రేషన్స్ వాయిదా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం తో చిత్ర యూనిట్ మహర్షి విజయోత్సవాలని ఘనం గా జరుపుకున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భం గా 50 రోజుల వేడుక ని చిత్ర యూనిట్ చేసుకుంటున్నారు. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ రాగా ఇప్పుడు ఈ వేడుక కి నాని అతిధి గా వస్తున్నాడు.

గతం లో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా కి ఒక ఈవెంట్ చేస్తే, దానికి మహేష్ హాజరయి చిత్ర యూనిట్ ని విష్ చేశాడు. ఇప్పుడు నాని…. మహేష్ బాబు సినిమాకి రాబోతున్నాడు.

అయితే ఇప్పుడు మహేష్ తండ్రి కృష్ణ సతీమణి విజయ నిర్మల హటాత్తు గా మరణించడం తో ఈ సమయం లో మహేష్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదని భావిప్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఈవెంట్ ని కాన్సిల్ చేసుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట.

First Published:  26 Jun 2019 10:08 PM GMT
Next Story