సమంత ప్రచారం….. ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాదట!

గత కొంతకాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకెళ్తున్న సమంత అక్కినేని ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో హిట్ అందుకుంది.

ప్రస్తుతం ‘ఓ బేబీ’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది సమంత. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 5 న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రబృందంతో పాటు సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్లలో బాగా పాల్గొంటోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం సమంత హైదరాబాద్ మాత్రమే కాక మరి కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం సమంత వైజాగ్, విజయవాడ, తిరుపతి వంటి సిటీలకు కూడా వెళ్లి తన చిత్రాన్ని ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి కాబట్టి… ఈ సినిమా ప్రమోషన్ లు ఎంత వరకు ఉపయోగపడతాయో చూడాలి. లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, ప్రగతి, తేజ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.