వ‌ర్మ‌ను మించిన వంగా… బాలీవుడ్‌లో త‌డాఖా !

రాంగోపాల్ వ‌ర్మ త‌ర్వాత మ‌రో తెలుగు డైరెక్ట‌ర్ బాలీవుడ్‌లో త‌డాఖా చూపించాడు. క‌బీర్‌సింగ్‌తో అర్జున్‌రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి వంగా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒకే ఒక సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసిన సందీప్‌…ఇప్పుడు క‌బీర్‌సింగ్‌తో బాలీవుడ్‌ త‌నవైపు చూసేలా చేశాడు.

క‌బీర్‌సింగ్ విడుద‌లై ఐదురోజులైంది. ఈ ఐదురోజుల్లోనే వంద‌కోట్లు కొల్లగొట్టింది. గ‌త కొన్ని ఏళ్లు సోలో హిట్ లేని షాహిద్ కపూర్‌ క‌బీర్‌సింగ్ తో మంచి హిట్ కొట్టాడు. సోమ‌వారం నుంచి ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది.

బాలీవుడ్ ప్ర‌ముఖ ట్రేడ్ అన‌లిస్ట్ త‌రణ్ ఆద‌ర్శ్ లెక్క‌ల ప్ర‌కారం మంగ‌ళ‌వారం 16.5 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఐదు రోజుల మొత్తం వ‌సూళ్లు 104 కోట్ల‌కు చేరింది. క‌బీర్‌సింగ్ క‌లెక్ష‌న్ల‌తో బాలీవుడ్ పెద్ద‌ల లెక్క‌లు మొత్తం ప‌టాపంచాల‌య్యాయి. బాలీవుడ్‌లో ఏ సినిమా కూడా ఇంత తొంద‌ర‌గా వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌లేద‌ని త‌రణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశాడు.

నాన్ హాలీడేస్‌లో విడుద‌లైన ఈ సినిమాపై బాలీవుడ్‌లో ముందు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ టీజ‌ర్‌తో పాటు అర్జున్‌రెడ్డి చూసిన వారు కొంద‌రు అక్క‌డ కూడా వివాదం చేశారు. దీంతో ఈసినిమాకు మంచి ఓపెన్సింగ్స్ వ‌చ్చాయి. జూన్ 21న విడుద‌లైన సినిమా శుక్ర‌వారం 20 కోట్లు, శ‌నివారం 21 కోట్లు , ఆదివారం 27.7 కోట్లు కలెక్ష‌న్లు వ‌చ్చాయి. టికెట్ల రేట్లు పెంపు లేకుండా ఈ ర‌కంగా క‌లెక్ష‌న్లు ఉంటే…ఇక మిగ‌తా ఫార్ములాలు కూడా వ‌ర్క్‌వుట్ అయితే ఈ సినిమా క‌లెక్ష‌న్లు ఇంకా అదిరిపోయేవ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇన్నాళ్లు బాలీవుడ్‌లో తెలుగు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ పేరు ఒక‌టే వినిపించేది. కానీ క‌బీర్‌సింగ్‌తో సందీప్‌రెడ్డి పేరు కూడా మారుమోగుతోంది. ఇంకో ద‌ర్శ‌కుడు బాలీవుడ్‌ను ఏలేందుకు ఇక్క‌డి నుంచి వెళ్లాడ‌నే ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.