Telugu Global
NEWS

టీడీపీ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ " జగన్ కీలక నిర్ణయం

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పదవి చేపట్టిన నాటి నుంచి పాలనలో దూసుకొని పోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న జగన్.. దీనికి కారణం గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతే ననే అభిప్రాయానికి వచ్చారు. అక్రమ కట్టడాల కూల్చివేతను మొదలు పెట్టిన మరుసటి రోజే అమరావతిలో కీలకమైన సీఆర్డీయేపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పాలసీలను సమీక్షించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. […]

టీడీపీ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ  జగన్ కీలక నిర్ణయం
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పదవి చేపట్టిన నాటి నుంచి పాలనలో దూసుకొని పోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న జగన్.. దీనికి కారణం గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతే ననే అభిప్రాయానికి వచ్చారు. అక్రమ కట్టడాల కూల్చివేతను మొదలు పెట్టిన మరుసటి రోజే అమరావతిలో కీలకమైన సీఆర్డీయేపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పాలసీలను సమీక్షించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఐదుగురు మంత్రులు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఈ కమిటీలో సభ్యులు.

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోనికి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏయే నిర్ణయాలు తీసుకున్నారు? ఏ ప్రాజెక్టులు చేపట్టారు?రాష్ట్రంలో ఏ సంస్థలు ఏర్పాటయ్యాయి? అనే వాటితో పాటు ప్రభుత్వ పాలసీలను కూడా సమీక్షించనున్నారు. ఈ కేబెనెట్ సబ్ కమిటీ దాదాపు 30 అంశాలను కూలంకషంగా సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

ఇప్పటికే పారదర్శకమైన, అవినీతి రహితమైన పాలన అందిస్తానని పలుమార్లు చెప్పిన వైఎస్ జగన్.. కేబినెట్ సబ్ కమిటీ వేయడం కీలకమైన నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆరు నెలల్లో తమ నివేదికను అందించాల్సి ఉంది. నివేదిక అందిన తర్వాత మరో సారి సమీక్షించి తదుపరి చర్యలను తీసుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సబ్ కమిటీ ఏర్పాటు గత ప్రభుత్వంలోని పెద్దలను భయాందోళనకు గురి చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

First Published:  26 Jun 2019 9:14 PM GMT
Next Story