Telugu Global
NEWS

బాబు భయపడ్డట్లే జరుగుతోంది

” నేను మీ ఇంటి పెద్ద కొడుకుని అనుకోండి. మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తా… ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి” శాసనసభ ఎన్నికలకు ముందు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వేడుకోలు ఇది. ఇంతే కాదు…. ఆ సభలో చంద్రబాబు నాయుడు తల వంచి నమస్కారం కూడా చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మరో […]

బాబు భయపడ్డట్లే జరుగుతోంది
X

” నేను మీ ఇంటి పెద్ద కొడుకుని అనుకోండి. మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తా… ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి” శాసనసభ ఎన్నికలకు ముందు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వేడుకోలు ఇది. ఇంతే కాదు…. ఆ సభలో చంద్రబాబు నాయుడు తల వంచి నమస్కారం కూడా చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

మరో సభలో “నన్ను జైలుకు పంపాలనుకుంటున్నారు. చుట్టూ ఉండి నన్ను మీరే కాపాడాలి” అని కూడా చంద్రబాబు నాయుడు అభ్యర్ధించారు.

మాజీ ముఖ్యమంత్రి, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు మరీ ఇంత దిగజారి ఎందుకు ప్రచారం చేస్తున్నారా? అని తెలుగు రాష్ట్ర్రాల ప్రజలు అప్పట్లో అనుమానించారు. ఆ అనుమానాల వెనుక ఉన్న భయాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి.

తాను అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు తాను అధికారాన్ని కోల్పోయిన తర్వాత బయట పడతాయనే ఆందోళన చంద్రబాబు నాయుడిని ఆనాడే వెంటాడిందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రజా వేదికను తమకు అప్పగించాలంటూ లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఆ అంశంపై చాలా సీరియస్ గా వ్యవహరించారు. దీనికి కారణం ప్రజా వేదిక అక్రమ నిర్మాణమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసునని, దానిపై ఆయన తప్పక చర్యలు తీసుకుంటారని చంద్రబాబు నాయుడు భయపడ్డారని అంటున్నారు.

అలాగే తన నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని, వాటితో పాటు తన హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలపై సమీక్షలు జరుపుతారనే భయం చంద్రబాబునాయుడిని ఆనాడే వెంటాడిందని అంటున్నారు. విద్యుత్ ఒప్పందాలతో పాటు పోలవరం, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులపై కూడా కొత్త ప్రభుత్వం విచారణలు చేయిస్తుందనే ఆందోళన చంద్రబాబు నాయుడిని వెంటాడిందని చెబుతున్నారు.

తన ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీనీ, ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన విధానంపై కూడా చంద్రబాబు నాయుడు కలత చెందారని అంటున్నారు. లేకపోతే ఎన్నడూ లేని విధంగా శిరసు వంచి నమస్కరిస్తాననడం, అలాగే చేయడం వంటివి ఆయన ఎప్పుడూ చేయరని అంటున్నారు. తాను సాధించిన ప్రగతిని చెప్పుకుని ఓట్లు అడగాల్పింది పోయి ఓటర్లను బతిమిలాడడం, ప్రాధేయపడడం వంటివి చంద్రబాబు నాయుడి భవిష్యత్ చిత్రపటానికి సూచికలని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు భయపడినట్లుగానే ఆయన అక్రమాలు, అవినీతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దర్యాప్తులకు ఆదేశించడం ఆయనను మరింత కలవరపెడుతోందని అంటున్నారు.

First Published:  28 Jun 2019 6:09 AM GMT
Next Story