Telugu Global
Cinema & Entertainment

రాజు గారి గది నుంచి తమన్న జంప్

ఓపెనింగ్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ ప్రాజెక్టులో నటించడం గర్వంగా ఉందంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చింది. కట్ చేస్తే, సినిమా ఓపెనింగ్ జరిగి 10 రోజులైనా కాకముందే రాజుగారి గది-3 ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది తమన్న. దీంతో యూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. రాజుగారి గది పెద్ద హిట్ అయింది. దాని సీక్వెల్ గా నాగ్ నటించిన రాజుగారి గది-2 కూడా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇదే ఊపులో […]

రాజు గారి గది నుంచి తమన్న జంప్
X

ఓపెనింగ్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ ప్రాజెక్టులో నటించడం గర్వంగా ఉందంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చింది. కట్ చేస్తే, సినిమా ఓపెనింగ్ జరిగి 10 రోజులైనా కాకముందే రాజుగారి గది-3 ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది తమన్న. దీంతో యూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

రాజుగారి గది పెద్ద హిట్ అయింది. దాని సీక్వెల్ గా నాగ్ నటించిన రాజుగారి గది-2 కూడా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇదే ఊపులో రాజుగారి గది-3 స్క్రిప్ట్ రాసుకున్న దర్శకుడు ఓంకార్.. ఈ కథలో మెయిన్ లీడ్ గా తమన్నను తీసుకున్నాడు. తమన్న కూడా కథ విని ఒప్పుకుంది. ప్రారంభోత్సవానికి కూడా హాజరైంది. అంతలోనే ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఓ బాలీవుడ్ సినిమా ఆఫర్ రావడంతోనే తమన్న ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హిందీలో నవజుద్దీన్ సిద్ధిఖి హీరోగా రానున్న ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించింది తమన్న. ఆ సినిమాతో రాజుగారి గది-3 కాల్షీట్లకు క్లాష్ వస్తోంది. అందుకే తెలుగు సినిమా కంటే బాలీవుడ్ సినిమాకే ప్రాధాన్యం ఇస్తూ ఆమె తప్పుకుంది.

హిందీలో ఆమెకు ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదు. కానీ బాలీవుడ్ అంటే తమన్నకు మోజు పోలేదు. ఎవరు ఏ చిన్న ఛాన్స్ ఇచ్చినా వెంటనే కాల్షీట్లు ఇస్తుంది. ఇప్పుడు ఓంకార్ సినిమాను కూడా అలానే వదిలేసుకుంది ఈ బ్యూటీ.

First Published:  28 Jun 2019 5:45 AM GMT
Next Story