Telugu Global
Cinema & Entertainment

కబీర్ సింగ్ చూడలేదు.... రీమేక్ సినిమాలపై విజయ్ కామెంట్స్....

‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో మంచి బ్రేక్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద ‘అర్జున్ రెడ్డి’ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడాడు విజయ్ దేవరకొండ. […]

కబీర్ సింగ్ చూడలేదు.... రీమేక్ సినిమాలపై విజయ్ కామెంట్స్....
X

‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో మంచి బ్రేక్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే సినిమా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద ‘అర్జున్ రెడ్డి’ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది.

తాజాగా సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడాడు విజయ్ దేవరకొండ. “నేను ఫ్రాన్స్ లో షూటింగ్ తో బిజీగా ఉండటం వలన సినిమా చూడటం కుదరలేదు. నా స్నేహితుడు సందీప్ వంగ కథను ఎలా మార్చాడో నాకు కూడా చూడాలని ఉంది” అని విజయ్ దేవరకొండ అన్నారు.

ఇక రీమేక్ ల గురించి మాట్లాడుతూ, “నేను ఎప్పటికీ ఒక్క రీమేక్ మూవీ చేయలేనేమో. ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఒకటే కథని రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలలో నటించే వారంటే నాకు నిజంగా చాలా గౌరవం” అని అన్నాడు విజయ్ దేవరకొండ.

అంటే ఇండైరెక్టుగా రీమేక్ సినిమా కథలతో తన వద్దకు రావద్దని డైరెక్టర్లకు హింట్ ఇస్తున్నాడని కొందరు అంటున్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలైలో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.

First Published:  28 Jun 2019 12:18 AM GMT
Next Story